Karunakaran | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మరోసారి మెగాఫోన్ పట్టనున్న కరుణాకరన్
డైరెక్టర్ కరుణాకరన్ ని (Karunakaran)ఈతరం ప్రేక్షకులు మరిచిపోవచ్చేమో కానీ తొలిప్రేమ సినిమా డైరెక్టర్ అంటే టక్కున గుర్తొస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన తొలిప్రేమ (Tholiprema) మూవీతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన కరుణాకరన్ లవ్ స్టోరీస్ తీయడంలో మాస్టర్ అని చెప్పుకోవచ్చు. తొలిప్రేమ హిట్ తర్వాత సుమంత్ తో యువకుడు మూవీ తీసి హిట్టు కొట్టారు. ఆ తర్వాత తెలుగులో బాలు, వాసు, హ్యాపీ,ఉల్లాసంగా ఉత్సాహంగా తీసి సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.
ప్రభాస్ తో డార్లింగ్ ఆఖరు హిట్టు
ప్రభాస్ తో (Prabhas) తీసిన డార్లింగ్ (Darling) మూవీ తన కెరీర్లో తొలిప్రేమ తర్వాత బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మూవీ తర్వాత కరుణాకరన్ కి సరైన హిట్టే పడలేదు. రామ్ తో తీసిన ఎందుకంటే ప్రేమంట స్టోరీ, ప్రజెంటేషన్ బాగున్నా.. ఎందుకో ఆ టైమ్ లో జనాలు యాక్సెప్ట్ చేయలేకప...




