Richest Beggar : ఈ బిచ్చగాడి లెవలే వేరు..
Richest Beggar : జీవితంలో బాగుపడాలంటే కష్టపడాలి. రెక్కలు ముక్కలు చేసుకుంటేనే సగటు జీవి (Common man) బతుకుబండిని లాగ గలడు. చెమటోడ్చితేనే వ్యక్తిగత, కుటుంబ అవసరాలు తీరుతాయి. విలాస జీవితం గడపాలంటే నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించాలి. పెద్దలు మనకు చెప్పింది ఇదే కదా..! అయితే.. ఇదంతా వేస్టు ముచ్చట అంటున్నారు బిచ్చగాళ్లు. జీవితం (Life) సాఫీగా సాగాలంటే యాచకమే మార్గమని అంటున్నారు. ముఖ్యంగా దేవాలయాలు, మసీదులు, దర్గాల వద్ద భిక్షాటతన చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని నిరూపిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అజ్మీర్ దర్గా వద్ద ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఓ బిచ్చగాడు (Richest Beggar) ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ వాడటం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
బిచ్చమెత్తుకొనే కొన్నా..
షేక్ అనే దివ్యాంగుడైన వ్యక్తి అజ్మీర్ దర్గా (Ajmer Dargah...




