Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Parliament Budget Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 31 నుంచి సమావేశాలు (Union Budget 2025) ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ నాలుగో తేదీన ముగుస్తాయి. తొలి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మలి విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి.
Union Budget 2025 Expectations Live Updates : సాధారణ మధ్య తరగతి ప్రజల టెక్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ వర్గాల వరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఎనిమిదో బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా...




