Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
One Nation One Election : జ‌మిలి ఎన్నిక‌లు.. పార్లమెంటరీ కమిటీ కీల‌క‌ సమావేశం
State

One Nation One Election : జ‌మిలి ఎన్నిక‌లు.. పార్లమెంటరీ కమిటీ కీల‌క‌ సమావేశం

జ‌మిలి ఎన్నిక‌లు (One Nation One Election) బిల్లుల‌ను ప‌రిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee) తొలి స‌మావేశం ఈ రోజు జ‌రిగింది. ఈ అంశంపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యాన్ని బీజేపీ (BJP) స‌భ్యులు స‌మ‌ర్థించ‌గా ప్ర‌తిప‌క్షాల నేత‌లు వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలో రెండు ప‌క్షాల వాద‌న‌ల‌ను పార్ల‌మెంట‌రీ క‌మిటీ (JPC) రికార్డు చేసింది. One Nation One Electionపై వాడీవేడి చ‌ర్చ‌ బీజేపీ ఎంపీ, కేంద్ర న్యాయ శాఖ మాజీ స‌హాయ మంత్రి పి.పి. చౌదరి నేతృత్వంలో 39 మంది సభ్యుల కమిటీ స‌మావేశమైంది. వీరిలో ప్రాధాన పార్టీల ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా, జేడీయూ నుంచి సంజయ్ ఝా, శివసేన నుంచి శ్రీ‌కాంత్ షిండే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ హాజ‌ర‌య్యారు. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ అ...
Court Jobs | జిల్లా కోర్టుల్లో కొలువులు.. ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం
career

Court Jobs | జిల్లా కోర్టుల్లో కొలువులు.. ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

Court Jobs in Telangana 2025 : తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో 340 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ ఉద్యోగాలకు జీతంతో పాటు అదనపు అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దరఖాస్తు వివరాలు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 జనవరి 8చివరి గడువు: 2025 జనవరి 31 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ http://tshc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితివయస్సు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య.సడలింపు: ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు. దివ్యాంగుల‌కు 10 ఏళ్లు.కట్ ఆఫ్ డేట్: 2025 జూలై 1. Court Jobs Notification 2025 జీతం , ఇతర ప్రయోజనాలు వేత‌నం: రూ. 24,280 – రూ. 72,850 (పే స్కేల్ ఆధారంగా). నెలసరి కనీస జీతం: సుమారు రూ. 31,000...
High Court : మ‌హిళ‌ల‌పై కామెంట్ కూడా లైంగిక వేధింపే : కేర‌ళ హైకోర్టు
Trending

High Court : మ‌హిళ‌ల‌పై కామెంట్ కూడా లైంగిక వేధింపే : కేర‌ళ హైకోర్టు

కేరళ హైకోర్టు (Kerala High Court) ఒక సంచ‌ల‌న‌ తీర్పును వెలువ‌రించింది. మహిళ శరీర నిర్మాణంపై వ్యాఖ్య చేయడం కూడా నేర‌మే అవుతుంద‌ని పేర్కొంది. ఇది లైంగిక వేధింపు (Sexual Harassment) కిందికే వ‌స్తుంద‌ని తేల్చి చెప్పింది. ఒక కేసులో న్యాయమూర్తి ఎ.బ‌ద‌రుద్దీన్ (Justice A Badaruddin) ఈ తీర్పును వెలువ‌రించారు. తనపై నమోదైన లైంగిక వేధింపు కేసును ర‌ద్దు చేయ‌మ‌ని కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (KSEB) ఉద్యోగి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు తిరస్క‌రించింది. ఒక మ‌హిళ శ‌రీర నిర్మాణంపై కామెంట్ చేయ‌డం సెక్స్ ఉద్దేశంతో ముడిప‌డి ఉంటుంద‌ని, ఇది కూడా లైంగిక వేధింపు కిందికే వ‌స్తుంద‌ని న్యాయమూర్తి తీర్చు చెప్పారు. కేసు పూర్వ‌ప‌రాలు కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ప‌నిచేసే త‌న స‌హోద్యోగి త‌న శరీర నిర్మాణంపై అస‌భ్య‌క‌రంగా మాట్లాడాడ‌ని అదే సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఓ మ‌హిళా ఉద్యోగి పోలీసుస్టేష‌న్‌లో గ‌తంలో ఫ...
Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..
Trending

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ ఒకే బాట‌. అంద‌రూ ఒకే మాట‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. పంచాయ‌తీ నియ‌మాల‌ను అనుస‌రించాల్సిందే. వీటిని పాటించి బ‌హుమ‌తి కొట్టాల్సిందే. పంజాబ్ రాష్ట్రం బ‌ఠిండా జిల్లా (Punjab's Bathinda district)లోని బ‌ల్లో (Ballo Village) గ్రామ పంచాయ‌తీ ఈ త‌ర‌హా ఆద‌ర్శ నిర్ణ‌యాలు తీసుకుంటోంది. త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను స‌న్మార్గంలో న‌డిపిస్తూ ఆ ప‌ల్లెను ప్ర‌గ‌తి ప‌థం వైపు తీసుకెళ్తోంది. వినూత్న ప్రోత్సాహం ఇప్ప‌టికే అనేక వినూత్న నిర్ణ‌యాల‌తో గ్రామాన్ని ఆద‌ర్శ‌ప్రాయంగా మారుస్తున్న బ‌ల్లో పంచాయ‌తీ.. తాజాగా మ‌రో కార్యాచ‌ర‌ణ‌కు తెర‌తీసింది. అక్క‌డ జ‌రిగే వివాహ వేడుక‌ల్లో డీజే సౌండ్ (DJ music) సిస్టం వినియోగం, మ‌ద్యాన్ని(liquor ) నిషేధించింది. ఈ నిబంధ‌న‌కు ఎంత‌టి వారైనా క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. దీన్ని ...
Pushpa-2 : పుష్ప -2 రీ లోడేడ్ వెర్షన్ రెడీ…
Cinema

Pushpa-2 : పుష్ప -2 రీ లోడేడ్ వెర్షన్ రెడీ…

గత సంవత్సరం బాక్సాఫీస్ ని బద్దలు కొట్టిన సినిమా పుష్ప -2 (Pushpa-2 ) . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మాస్ యాక్షన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandhana) హోమ్లి పర్ఫామెన్స్ , సుకుమార్ (Sukumar) సూపర్ టేకింగ్ , రాక్ స్టార్ డీ ఎస్పీ (DSP)మ్యూజిక్ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిపింది. దాదాపు 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 (Bahubali-2) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టింది. దంగల్ (Dangal) 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నెంబర్ వన్ లో ఉండగా.. బాహుబలి 2 ఆ తర్వాత స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. హిందీలో 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా అక్కడ ఆడియన్స్ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. ...
error: Content is protected !!