Mann ki Baat | ప్రధాని మోదీ మన్ కీ బాత్.. ఏమన్నారంటే..
PM Modi Mann ki Baat : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Modi Mann ki Baat) కార్యక్రమం (117వ ఎపిసోడ్) ద్వారా ప్రజలను ఉద్దేశించి నేడు మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగంపై కూడా ఆయన మాట్లాడారు. 2025లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందన్నారు. రాజ్యాంగం మనందరికీ అనుసరణీయమని, మార్గదర్శకమని అన్నారు.
వీడియోలు అప్‌లోడ్ చేయండి
రాజ్యాంగ వారసత్వాన్ని దేశ ప్రజలకు చేరువయ్యేలా constitution75.com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామని ప్రధాని మోదీ తెలిపారు. రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశంపై మీ వీడియోలను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చని అన్నారు. వివిధ భాషల్లో రాజ్యాంగాన్ని చదవచ్చని, అలాగే ప్రశ్నలు అడిగే అవకాశం కూడా అడగొచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతీ ...




