Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ACB అధికారులకు తెలియాల్సిందే…
Special Stories

ACB అధికారులకు తెలియాల్సిందే…

హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో లంచాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే… హోదాను బట్టి లంచాలు… ప్రైవేట్ అసిస్టెంట్ లతో వసూళ్లు.. కార్యాలయంలో తీసుకుంటున్న లంచాలు చూస్తే ACB అధికారులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే.. ACB | హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో ఆ అధికారులు తీసుకుంటున్న లంచాలను చూస్తే "ACB" అధికారులు సైతం ఆశ్చర్యపోతారని, లంచాల వివరాలు చూస్తే వారు షాక్ కు గురికాక తప్పదని వాహనదారులు అంటున్నారు. గత రెండు రోజులుగా "సర్కార్" వెబ్ సైట్ ప్రచురిస్తున్న వరుస కథనాలను గమనిస్తున్న వాహనదారులు.. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఎవరికి వారే అవును ఇది నిజం నాకూ ఇలాగే జరిగింది.. నేను కూడా ఫలానా పనికి (సేవకు) కార్యాలయం వెలుపల ఉన్న అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ వద్ద లంచం ఇచ్చి పత్రాలపై కోడ్(చుక్క) ను వేపించుకుంటేనే పని అయింది అని చర్చించుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ఎలాగైనా "అ...
Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు
State

Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు

Hyderabad Metro  : హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌స్తుతం మెట్రో రైలుకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ట్రాఫిక్ అంత‌రాయాలు లేకుండా, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తున్నమెట్రో రైలు న‌గ‌రంలోని అన్ని వ‌ర్గాల‌కు ద‌గ్గ‌రైంది. ఒక వైపు ప్రయాణికులకు మెరుగైన సేవ‌లందిస్తూనే మ‌రోవైపు అనేక‌ రికార్డ్‌లను సృష్టిస్తోంది. అయితే భాగ్య‌న‌గ‌రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్క‌ట్ల‌ను అధిగమించేందుక అలాగే వేగంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇప్పుడు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. మ‌రోవైపు ఉద్యోగులు, విద్యార్థులు సైతం మెట్రో రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో మెట్రో రైలులో రద్దీ బాగా పెరిగిపోయింది. బిజినెస్‌ వేళల్లో కనీసం కాలు కూడా నిలపలేని పరిస్థితి నెల‌కొంటోంది. ట్రైన్లలో కూర్చుని సీట్లు దొర‌క‌డం గ‌గ‌ణ‌మైపోయింది. ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్‌మ...
Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..
Crime

Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Food Poisoning : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఫుడ్ పాయిజనింగ్‌ ఘటన జుక్కల్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. Food Poisoning in Kamareddy District : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్‌ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం నలుగురు విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. నివేదికల ప్రకారం, నలుగురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులయ్యాయి. వీరిని సిబ్బంది చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తీవ్ర కడుపునొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరాడు. అన్నం ఉడకపోవడం వల్ల కడుపునొప్పి వచ్చిందని విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ...
Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట
State

Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట

Formula E Car Case | మాజీ మంత్రి కె.తార‌క రామారావు (KT Rama rao)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని కేటీఆర్ స‌మ‌ర్పించిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై హైకోర్టులో శుక్ర‌వారం విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. మ‌రోవైపు కేటీఆర్‌పై ఏసీబీ(ACB) నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవ‌చ్చని పేర్కొంది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు (High Court ) ఈనెల 27కి వాయిదా వేసింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి కోరారు. కేటీఆర్‌ ‌తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది సుందరం ప్రభాకర్‌రావు, గండ్ర మోహ...
Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌
National

Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌

Om Prakash Chautala | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌ద‌ళ్‌ (INLD) నేత ఓంప్రకాశ్ చౌతాలా (89) ఈ రోజు మ‌ధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గురుగ్రాంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో 12 గంట‌ల‌కు చౌతాలా క‌న్నుమూశార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. మాజీ ఉప ప్ర‌ధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్ర‌కాశ్ హ‌ర్యానా సీఎంగా ఐదుసార్లు ప్రాతిధ్యం వ‌హించారు. ఆరోగ్యం క్షీణించి.. ఓంప్ర‌కాశ్ చౌతాలా (Om Prakash Chautala) మూడు నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈరోజు ఉదయం చౌతాలా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింద‌ని, దీంతో 11:35 గంటలకు ఆస్ప‌త్రిలో చేర్చామ‌ని, ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు నిర్ధారించార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు రేపు (శ‌నివారం) సిర్సా ...
error: Content is protected !!