Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Enforcement Directorate : ఈడీ ఎదుట కేటీఆర్‌.. తీవ్ర ఉద్రిక్త‌త
State

Enforcement Directorate : ఈడీ ఎదుట కేటీఆర్‌.. తీవ్ర ఉద్రిక్త‌త

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర‌ కలకలం రేపుతున్న ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ ((Bharat Rashtra Samithi (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT.Rama Rao ) ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తమైంది. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ (Enforcement Directorate) కార్యాలయం వ‌ద్ద ఉద్రిక్త‌త‌ గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కేటీఆర్‌ (KTR) ఉదయం 10 గంటలకు బయలుదేరి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈడీ (Enforcement Directorate) కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి చేరుకొని కేంద్ర‌ ప్రభుత్వం తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు, బీఆర్...
Saif Ali Khan :  క‌త్తిపోట్ల‌కు గురైన బాలివుడ్ హీరో.. అసలేం జరిగింది?
Cinema

Saif Ali Khan : క‌త్తిపోట్ల‌కు గురైన బాలివుడ్ హీరో.. అసలేం జరిగింది?

Saif Ali Khan stabbed : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. తీవ్ర‌ క‌త్తిపోట్ల‌కు గురైన ఆయ‌న ఆస్ప‌త్రి పాల‌య్యారు. ముంబై (Mumbai) బాంద్రాలోని ఆయ‌న‌ నివాసం వ‌ద్ద ఈరోజు తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ సంఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొర‌బ‌డిన ఓ ఆగంత‌కుడు ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఇంట్లోకి ఆగంత‌కుడు చొర‌బ‌డ్డాడని గుర్తించిన సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఎలాంటి ఆయుధం లేకుండానే అత‌డికి ఎదురొడ్డారు. ఈ క్ర‌మంలో త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో అత‌డు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చాడు. సైఫ్ అలీ ఖాన్ శ‌రీరంపై లోతైన గాయాలు క‌త్తిపోట్ల‌కు గురైన సైఫ్ అలీ ఖాన్‌ను లీలావ‌తి ఆస్ప‌త్రి (Lilavati Hospital in Mumbai)కి త‌ర‌లించారు. ఆయ‌న శ‌రీరంపై మొత్తం ఆరు గాయాలు ఉన్నాయ‌ని ఆస్ప‌త్రి సీఈవో డాక్ట‌ర్ నీర‌జ్ ఉట్ట‌మాని తెలిపారు. సైఫ్ అలీకి అయిన గాయా...
South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
State

South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌కు ప్ర‌యాణికుల నుంచి అపూర్వ స్పంద‌న వ‌స్తోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతమయ్యాయి. ప్ర‌స్తుతం అవి న‌డుస్తున్న అన్ని రూట్లలో ప్ర‌యాణికుల‌తో నిండిపోతున్నాయి. అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు స్థిరంగా 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో న‌డుస్తున్నాయి. హైదరాబాద్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కనెక్టివిటీ సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - యశ్వంతపూర్ (బెంగళూరు), సికింద్రాబాద్ - నాగ్‌పూర్ మార్గాల్లో సేవ‌లందిస్తున్నాయి.. వందే భారత్ ఆక్యుపెన్సీకి సంబంధించిన ఇటీవలి వివ‌రాల ప్రకారం.. ఈ సేవలను 143 శాతం వరకు అధిక ఆదరణ పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 100 శాతం కంటే ఎక్కువ ఆక్యు...
Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?
National

Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?

Indian Army Day : భార‌త సైనిక 77వ దినోత్స‌వం పూణెలో ఈ రోజు అత్యంత ఘ‌నంగా ప్రారంభమైంది. 1949లో ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియ‌ప్ప (Marshal Cariappa) మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులైన చారిత్ర‌క నేపథ్యంలో ప్ర‌తి ఏడాది దీన్ని నిర్వ‌హిస్తారు. సైనిక రంగంలో భార‌తదేశంలో సార్వభౌమత్వం, స్వయం సమృద్ధిని సాధించిన గుర్తింపుగా జ‌రుపుతారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఈ సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తారు. సైనిక దినోత్స‌వంలో రోబిటిక్ డాగ్స్‌ సైనిక దినోత్స‌వం ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా రోబోటిక్ జాగిలాలు (Robotic Dogs) నిలిచాయి. మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (MULEs)గా పిలువబడే రోబోటిక్ డాగ్స్‌ను ఈ ప‌రేడ్‌లో ప్రముఖంగా ప్రదర్శించారు. భార‌త సేన 100కు పైగా ఈ రోబోటిక్ డాగ్స్ (Robotic Dogs)ను త‌న ఆయుధ శాల‌కు చేర్చుకుంది. క్లిష్టమైన ప్రదేశాలలో మానవ సైనికులు ఎదుర్కొనే ప్రమాదాలను...
KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు
State

KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు

Hyderabad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (BRS working president KTR)కు మ‌ళ్లీ నిరశే ఎదురైంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఈ రోజు తిరస్కరించింది. త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ ఆశ్ర‌యించగా ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు ఉత్త‌ర్వుల్లో జోక్యం చేసుకోలేమ‌ని.. కేటీఆర్ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయమూర్తులు బేలా ఎం.త్రివేది (Justices Bela M Trivedi), పి.బి.వరాలే (PB Varale)తో కూడిన ధర్మాసనం దానిని తిర‌స్క‌రించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ముందుగానే తిరస్కరించన విష‌యం విదిత‌మే. హైకోర్టు (Telangana High Court) జారీ చేసిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమ‌ని పేర్కొంటూ కేటీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేస...
error: Content is protected !!