Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
                    Winter Season | తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి వేళ 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.3 డిగ్రీలు నమోదు అయింది. అలాగే న్యాల్కల్‌లో 9.6 డిగ్రీలు, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.. మెదక్ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీలు రికార్డ్ అయింది.
ఇదిలా ఉండగా , సోమవారం రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.. సిర్పూర్(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయినట్లు అధికారులు తెలిపారు.  సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్య...                
                
             
								



