Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Job Scam | రూ.2 లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు..
Special Stories

Job Scam | రూ.2 లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు..

అటవీ శాఖలో ఉద్యోగం పేరుతో మోసం అడ్వాన్స్ లక్ష.. విధుల్లో చేరాక మరో లక్ష అంటూ నిరుద్యోగిని మోసం చేసిన మహిళ ఉద్యోగం కల్పించలేదు..? డబ్బులు తిరిగి చెల్లించరు..? Job Scam in Hanmakonda | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్న తపన.. ఓ ఆఫీసులో ఉద్యోగాలు పెట్టిస్తున్నారన్న వార్త తన చెవిలో పడింది. గంపెడాశలతో ఆ ఆఫీసుకు వెళ్లిన సదరు వ్యక్తికి వాళ్ళు చెప్పిన కహానీ ఆశలు రేకెత్తించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అందులోనూ అటవీ శాఖ (Forest Department) లో ఇంకేముంది ఇంటికెళ్లి తల్లిదండ్రులను ఒప్పించాడు వాళ్ళు అడిగిన అడ్వాన్స్ డబ్బులు ఎలాగోలా సమర్పించుకున్నాడు. నెల రోజుల్లో ఉద్యోగంలో చేరవచ్చు, ఉద్యోగం కోసం తల్లిదండ్రులు వడ్డీకి తెచ్చిన అప్పు కట్టచ్చని భావించిన సదరు నిరుద్యోగికి నెల రోజులకే ఊహించని షాక్ తగిలింది. డబ్బులు చెల్లించి నాలుగు నెలలు గడిచింది.. ఇంకా ఉద్యోగం రావట...
ACB Rids | ఏసీబీ అదుపులో  ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్
State, Hyderabad

ACB Rids | ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్

హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌ లోని పది చోట్ల ఏకాలంలో సోదాలు.. Hydrabad : నీటి పారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ మురళీధర్‌రావు (Muralidar Rao) ఇంట్లో ఏసీబీ ఆకస్మికంగా సోదాలు (ACB Rids) చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై పలు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌.. మొత్తం 10 చోట్ల ఏకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈఎన్‌సీ జనరల్‌ (ENC General) గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ముళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 సంవత్సరాల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు...
Hyderabad |  హైదరాబాద్ లో  కాల్పుల కలకలం
Crime

Hyderabad | హైదరాబాద్ లో కాల్పుల కలకలం

Hyderabad Breaking News | హైదరాబాద్ లోని మలక్ పేటలో ఈ రోజు ఉదయాన్ని కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శాలివాహననగర్ పార్క్ లో వాకర్స్ పై ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో  సీపీఐ (CPI) నాయకుడు చందు నాయక్ (43) మృతిచెందాడు. మంగళవారం శాలివాహన నగర్ పార్క్ వద్ద ఉదయం నడకకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ వెంటాడి వెంబడించి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి కారులో పరారయ్యారు. దుండగులు. హత్య సమయంలో ఐదురుగు మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మరణించాడు. నాయక్ తోడుగా వస్తున్న ఆయన భార్య, కూతురు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం నర్సాయిపల్లికి చెందిన చందు నాయక్ హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు సేకరించడానికి ఫోరెన్స...
BSNL | బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్​తో ప్రైవేట్ ఆపరేటర్లకు షాక్​.. రూ. 200 కంటే తక్కువ ధరకే నెలవారీ రీచార్జ్​
Technology

BSNL | బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్​తో ప్రైవేట్ ఆపరేటర్లకు షాక్​.. రూ. 200 కంటే తక్కువ ధరకే నెలవారీ రీచార్జ్​

BSNL ₹199 Plan | బిఎస్ఎన్ఎల్ మరోసారి ప్రైవేట్ కంపెనీలను షాకిచ్చింది. ప్రభుత్వ టెలికాం సంస్థ మరో చవకైన ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో వినియోగదారులు నెల మొత్తం వాలిడిటీని పొందుతారు. అంటే 30 రోజులు పాటు వినియోగదారులు అపరిమిత కాలింగ్, డేటాను ఆస్వాదించవచ్చు. దీనితో పాటు, బిఎస్ఎన్ఎల్ అనేక ఇతర చౌక ప్లాన్‌లను అందిస్తుంది, దీనిలో వినియోగదారులు తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక చెల్లుబాటును పొందుతారు. BSNL ₹199 Plan | బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్ ఈ కొత్త ప్లాన్ వివరాలను BSNL రాజస్థాన్ షేర్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో షేర్ చేయబడిన సమాచారం ప్రకారం, ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 199 కు వస్తుంది. ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల విషయానికొస్తే వినియోగదారులు భారతదేశంలో ఎక్కడికైనా కాల్ చేయడానికి అపరిమిత కాల్స్​ పొందుతారు అలాగే, ఈ ప్లాన్ ఉచిత జాతీయ రోమింగ్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌లో BSNL వినియోగ...
నేడు కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ  – New Ration Cards
State, Nalgonda

నేడు కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ – New Ration Cards

New Ration Cards Distribution | ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న ల‌క్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఈరోజు (14వ తేదీ) సూర్యాపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించ‌నున్న కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Minister Uttam kumar Reddy) పేర్కొన్నారు. కాగా తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త‌ రేషన్ కార...
error: Content is protected !!