Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Warangal Traffic | ఓరుగల్లు ట్రాఫిక్ లో చతుర్దందం!
Special Stories

Warangal Traffic | ఓరుగల్లు ట్రాఫిక్ లో చతుర్దందం!

ట్రాఫిక్‌లో డ్యూటీలు, పోస్టింగులు నలుగురు హోంగార్డుల చేతిలోనట..! వైన్ షాపులు, బార్లు, షాపింగ్ మాళ్ల వద్ద నెలవారీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ? కమిషనరేట్ పరిధిలో హోంగార్డులే తమ సహచరులపై బహిరంగ విమర్శలు ఓ అధికారి కొడుకు పుట్టిన రోజు వేడుకలకూ ఫండ్ వసూలు.. ? Warangal Traffic | వరంగల్ ట్రాఫిక్ లో "చతుర్దందం'జోరుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి నచ్చితే "ఓకే" లేదంటే 'నో" అనే స్థాయిలో అధికారులు ఉన్నారంటే వారు ఏ స్థాయిలో ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి కలిగి ఉన్నారో, ఆ నలుగురు ఏ స్థాయిలో అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. వరంగల్ ట్రాఫిక్ ( Warangal Traffic Department) కు ఏ హోంగార్డు రావాలన్న? ట్రాఫిక్ లో ఉన్న ఏ హోంగార్డు (Home Guards) అదే ప్రాంతంలో కొనసాగలన్నా వీరిని తప్పనిసరిగా ప్రసన్నం చేసుకోవాల్సిందేనని తెలుస్తోంది. అంతేకాకుండా నెలవారీ మామూళ్లు వస...
Bhoobharati : భూభారతి – పేరు కొత్తదైనా, లోపాలు పాతవే?
Special Stories

Bhoobharati : భూభారతి – పేరు కొత్తదైనా, లోపాలు పాతవే?

మ‌రి కాంగ్రెస్ మార్క్ ఎక్క‌డ ? ధరణికి, భూ భారతికి కనిపించని వ్యత్యాసం.. ధరణిని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అదే మార్గాన్ని అనుసరిస్తోంద‌ని విమర్శలు భూభారతిలో ఆ నిబంధనలు తీసుకురావాలంటున్న రెవెన్యూ అధికారులు, ప్రజలు..? Bhoobharati vs Dharani | పది సంవత్సరాల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పాలనలో కల్వకుంట్ల కుటుంబంతోపాటు వాళ్ల‌ అనుచరులు ధరణి (Dharani) పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత‌లు పదే పదే బహిరంగ సమావేశాల్లో, ప్రెస్ మీట్‌ల‌లో అనేక రకాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం తామేదో గొప్పగా ధరణిలోని లోపాలను సవరించుకుంటూ దానికంటే అద్భుతమైన ఆర్‌వోఆర్ చ‌ట్టాన్ని తీసుకువస్తామని చెప్పి అదే పోర్ట‌ల్‌ పేరు మార్చి భూభారతి (Bhoobharati ) పేర ప్రవేశపెట్టారని క్షేత్రస్థాయిలో ప్రజలతోపాటు రెవెన్యూ అధికారులు సైతం భూభారతి పట్ల అసహనంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ...
Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు
Cinema

Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు

Kota Srinivasa Rao | టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా తన ప్ర‌తిభ‌నుచాటారు. నాలుగు దశాబ్దాల ప్రయాణం.. కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao ) 1942 జులై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లా కంకిపాడులో జన్మించారు. కోట తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట శ్రీనివాస‌రావు కూడా తండ్రి మాదిరిగా డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే, న‌ట‌న‌పై ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా ‘సువర్ణ సుందరి’ అనే సినిమాలో నటి...
ACB Raids | రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
Crime

ACB Raids | రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ

ACB Raids in Peddapalli : లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వద్ద నుంచి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం ఏకంగా రూ.90 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కగా వల పన్ని.. బాధితుడి నుండి ఏఈ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.ఈసందర్భంగా డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు త...
Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి
Viral

Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి

Mahaboob Nagar Viral Video | : సెల్ఫీ తీసుకునే నెపంతో ఓ భార్య‌ తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసిన ఘటన శనివారం క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని కడ్లూర్ గ్రామంలోని కృష్ణా నదిపై ఉన్న వంతెన దగ్గరకు తాతప్ప, అతడి భార్య వ‌చ్చారు. ఈ వంతెన తెలంగాణలోని నారాయణపేట జిల్లాతో సరిహద్దులో ఉంటుంది. వంతెన వద్దకు చేరుకున్న తర్వాత, తాతప్ప, అతని భార్య మొబైల్‌లో కొన్ని ఫోటోలు తీశారు. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు, భర్త ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు . తాతప్ప ఈదుకుంటూ నదిలో ఉన్న ఒక బండరాయిని పట్టుకోగలిగాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తాడుతో అతన్ని రక్షించారు. ఊపిరి పీల్చుకున్న తర్వాత, తాతప్ప తన భార్య తనను ఉద్దేశపూర్వకంగా నదిలోకి తోసిందని ఆరోపించాడు. ఆ జంట అక్కడికక్కడే గొడవ పడుతుండగా, స్థానికులు వారిని శాంతింపజేసి వారి తల్లిదండ్రులకు ఫోన్ చే...
error: Content is protected !!