జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “ఓటు చోరీ” వివాదం — ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు! Jubilee Hills By-Election
Jubilee Hills By-Election : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “ఓటు చోరీ” ప్రచారం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కే తిప్పికొడుతోందన్న చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) నేపథ్యంలో యూసుఫ్‌గూడ డివిజన్‌లో భారీ స్థాయిలో నకిలీ ఓటర్లు నమోదైనట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూసుఫ్‌గూడలో ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదైనట్లు తేలింది.
యూసుఫ్‌గూడ డివిజన్‌లోని కృష్ణనగర్ బి బ్లాక్ తాజా ఓటర్ల జాబితా ప్రకారం, బూత్ నంబర్ 246 కింద ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారు. అంతేకాకుండా ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో ఓటర్లను నమోదు చేసుకుంటున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయి.
BRS ప్రతినిధి వై సతీష్ రెడ్డి ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు, “వేలాది మందిలో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. (ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు) ఇక్కడి ఓటరు, జాగ్రత్తగా చూ...




