Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Illegal Colleges | విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు..
Special Stories

Illegal Colleges | విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు..

రెజోనెన్సు కళాశాలలపై చర్యలు ఎందుకు లేవు? కళాశాలలను సీజ్ చేయడానికి హన్మకొండ డీఐఈఓ వెనుకడుగు? అనుమతి లేని బ్రాంచీలపై ఫొటోలతో సహా కథనాలు వెలువరించినా చర్యలు శూన్యం కార్యాలయంలో దొరకడు… ఫోన్ లో అందుబాటులోకి రాడు! Illegal Colleges in Hanamkonda | రెజోనెన్సు కాలేజీలపై డీఐఈఓ కు అమితమైన ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హన్మకొండ నగరంలో ఆ కాలేజి యాజమాన్యం అనుమతి లేకుండా 5 బ్రాంచీలను నిర్వహించడంతోపాటు ఐఐటీ, నీట్, జేఈఈ, ఏసీ తరగతుల పేర లక్షలరూపాయల ఫీజులు వసూళ్ళుచేస్తున్నట్లు తెలుస్తోంది. రెజోనెన్సు యాజమాన్యం అనుమతి లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్న విషయాన్ని ఫొటోలతో సహ బహిర్గతం చేసినప్పటికీ డీఐఈఓ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఆ కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక అమ్యామ్యాల రహస్యం దాగి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. Illegal Colleges : స్పంద...
NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
warangal, State

NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం Mulugu : సీనియర్ జర్నలిస్ట్‌, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన 'ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం. గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజ...
Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్
Karimnagar

Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్

Peddaplli News : సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) రైలు మరోసారి మార్గమధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. అయితే ఎంతసేపటికీ రైలు కదలలేదు. మరోవైపు అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం కాలినడకన రాజీవ్‌ రహదారిపైకి చేరుకున్నారు. బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రతీరోజు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలురి ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఉదయాన్నే వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు...
Chhattisgarh | ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మహిళ మావోయిస్టులు హతం
Crime

Chhattisgarh | ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మహిళ మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మద్ (Abujhmad) ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు . సంఘటన స్థలం వద్ద 315 బోర్ రైఫిల్స్ తోపాటు ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కోకమెట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోకమెట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నారాయణపూర్ నుంచి డిఆర్జి, కొండగావ్ నుంచి ఎస్టీఎఫ్ సిబ్బందిని నక్సల్ ఆపరేషన్ కోసం పంపామని పోలీసులు వెల్లడించారు. బుధవారం రాత్రి పోలీస్ బలగాలు , మావోయిస్టులు సమావేశమైన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఉదయం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు, ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు వార్తలు,...
Accident | గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్సై, కానిస్టేబుల్ మృతి
Crime

Accident | గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్సై, కానిస్టేబుల్ మృతి

Kodada | కోదాడ స‌మీపంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం(Road Accident) లో ఒక ఎస్సై, కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు (Crime News). ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కోనసీమ జిల్లా (Konaseema District) ఆలమూరు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్‌, కానిస్టేబుల్ వీరస్వామి ఓ పని నిమిత్తం హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు కోదాడ పరిధిలో గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌లో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తర...
error: Content is protected !!