Kamareddy | భారీ వర్షాలు.. కామారెడ్డిలో కొట్టుకుపోయిన వాహనాలు
Kamareddy News | కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మత్తడి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది. జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుతో నిండిపోయింది. అనేక కాలనీలో జలమయమై కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు చేరడంతో అక్కడివారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడు చూడని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్న...




