ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..
ఏసీబీ దాడుల్లో ఒకే రోజు ముగ్గురు లంచావతారుల అరెస్టు..
పెద్దపల్లిలో రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ముసిసిపల్ ఉద్యోగులు
ACB Raids in Telangana | అవినీతి నిరోధక శాఖ లంచగొండి అధికారుల భరతం పడుతోంది.. ప్రతీరోజు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఆకస్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. తాజాగాఇంటి నంబర్ కోసం రూ. 5000 లంచం డిమాండ్ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లిలోని ద్వారకా నగర్ కు చెందిన ఎ.ప్రసాద్ అనే వ్యక్తి కొత్తగా నిర్మించుకున్న ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ సిబ్బందిని ఆశ్రయించాడు. కాగా బాధితుడిని ఏడాది పాటు ఆర్‌ఐ వినోద్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్‌కుమార్ రూ.10వేల డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస...




