Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Corona Virus | భారత్‌లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు
National

Corona Virus | భారత్‌లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు

Corona Virus | భారత్ లో మరోసారి కరోనా వైరస్‌ (COVID-19) ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 564 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,866కి చేరింది. రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు: కేరళ – 1,487 కేసులు ఢిల్లీ – 562 కేసులు పశ్చిమ బెంగాల్ – 538 కేసులు మహారాష్ట్ర – 526 కేసులు గుజరాత్ – 508 కేసులు కర్ణాటక – 436 కేసులు తమిళనాడు – 213 కేసులు Corona Virus : పెరుగుతున్న మరణాలు.. గత 24 గంటల్లో 7 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇందులో ఢిల్లీలో ఒక చిన్నారి సహా ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు మరణించారు. దీంతో 2025లో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 51కి పెరిగింది. కాగా, ఇప్పటివరకు 3,955 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజల...
Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన
Hyderabad, State

Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన

వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ దివ్యాంగుల ఉపకరణాల కోసం ఏటా రూ.50 కోట్లు మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి సీత‌క్క‌ Hyderabad : అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క (Minister Seethakka) తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధో మథ‌న సదస్సు 2025 జ‌రిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించి అభినందించారు. అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్, బాలమృతం రుచి చూశారు. బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ఆదివాసీల ఆహార...
పౌర సరఫరాల శాఖలో.. కాసుల “రాణి”  – Civil Supplies Department
Special Stories

పౌర సరఫరాల శాఖలో.. కాసుల “రాణి” – Civil Supplies Department

ఏ ఫైలు కదలాలన్నా.. మేడం చేయి తడపాల్సిందేనట..? Corruption in Civil Supplies Department | రాజుల కాలంలో రాజ్యానికి రాణులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ కార్యాలయానికి కూడా ఓ రాణి ఉందంటే అతిశయోక్తి కాదట. రాణి అంటే మహారాణి కాదు "కాసుల రాణి". ఓ మహిళా అధికారి ఆ కార్యాలయాన్నే తన సామ్రాజ్యంగా ఫీల్ అవుతూ తనకు తాను ఆ కార్యాలయానికే "రాణి "లా ఊహించుకుంటూ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె రాచరిక పోకడలు, మిల్లర్ పట్ల ఆమె ప్రదర్శిస్తున్న తీరు చూస్తుంటే రాజుల కాలం గుర్తొస్తుందని కొంతమంది మిల్లర్ బహిరంగంగానే ఆ అధికారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.హన్మకొండ పౌరసరఫరాల శాఖలో ఏ ఫైలు కదలాలన్న,ఆ ఫైలు మీద ఆమె సంతకం చేయాలన్న మేడం ను కలవాల్సిందేనట,కలుసుడంటే అలా ఇలా కలుసుడు కాదు కాసులతో కలిస్తేనే వాళ్ళ ఫైళ్లు కదులుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. Civil Supplies | ఫైలు కదలాలంటే.. ముడుపులు ...
Bullet Train Big Update : భార‌త‌దేశ‌పు మొట్ట‌మొద‌టి బుల్లెట్ ట్రైన్.. 12 స్టేషన్లతో రూట్ మ్యాప్ విడుదల,
Trending

Bullet Train Big Update : భార‌త‌దేశ‌పు మొట్ట‌మొద‌టి బుల్లెట్ ట్రైన్.. 12 స్టేషన్లతో రూట్ మ్యాప్ విడుదల,

Bullet Train Speed : భారతదేశంలో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు అయిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు నిర్మాణం పూర్తయ్యే దిశగా సాగుతోంది. 508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా -నాగర్ హవేలి గుండా వెళుతుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఈ రైలు కోసం ట్రయల్స్ ఇప్పటికే జపాన్‌లో ప్రారంభమయ్యాయని, 2026 నాటికి ఇది భారతదేశంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. బుల్లెట్ రైలు 12 స్టేషన్ల మీదుగా ప‌రుగులు ముంబై (బాంద్రా కుర్లా కాంప్లెక్స్): ఇది కారిడార్ యొక్క ప్రారంభ స్టేషన్ అవుతుంది.థానే: థానేలోని స్టేషన్ డోంబివ్లి తూర్పు సమీపంలో ప్రతిపాదించబడింది.విరార్: ఇది పాల్ఘర్ జిల్లాలో ఉన్న మహారాష్ట్రలోని మూడవ స్టేషన్ అవుతుంది.బోయిసర్: బోయిసర్ స్టేషన్ సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతుంది.వాపి: గుజరాత్‌లోని మొదటి స్టేషన్, వాపి ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం.బిలిమోరా:...
CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
Hyderabad

CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

Hyderabad : ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస...
error: Content is protected !!