JNU | జేఎన్‌యూలో మరోసారి వివాదం
Jawaharlal Nehru University : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో మరోసారి వివాదం చెలరేగింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీపై తీసిన నిషేధిత BBC డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శించడం కలకలం రేపింది. కొంత మంది విద్యార్థులు దీన్ని ప్రదర్శించగా విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం అభ్యంతరం వ్యక్తం చేయడం, డాక్యుమెంటరీని ఆపకుంటే కఠిన చర్యలకు వెనకాడబోమని హోచ్చరికలు జారీ చేయడం, దీన్ని ఆ విద్యార్థులు ధిక్కరించడం ఉద్రిక్తంగా మారింది.
ప్రాజెక్టర్‌ను అనుమతించకపోవడంతో...
వామపక్ష అనుకూల అఖిల భారత విద్యార్థుల సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన మొదట ప్రొజెక్టర్ ద్వారా చేయాలని భావించారు. అయితే.. భద్రతా సిబ్బంది ప్రొజెక్టర్‌ను అనుమతించలేదు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని గంగా ధాబాలో ల్యాప్‌టాప్ ద్వారా డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
JNU పరిపాలన విభాగం సీరియస్...




