ఎల్ఓసి అంతటా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు – India-Pakistan War LIVE Updates
India-Pakistan War LIVE Updates : ఆపరేషన్ సిందూర్ తో తీవ్ర పరాభవానికి గురైన పాకిస్తాన్.. పరువు నిలుపుకునేందుకు జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌తో సహా అనేక భారత సైనిక, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది, క్షిపణులతోపాటు పేలోడ్‌లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే మరోసారి భారత ఆర్మీ తనదైన శైలిలో పాక్ కు గట్టిగుణపాటం చెప్పింది. మన వైమానిక రక్షణ వ్యవస్థలు రాబోయే ముప్పులను ముందే పసిగట్టి మిసైళ్లను విజయవంతంగా తిప్పికొట్టాయి.
భారత్ - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, మే 7–8 రాత్రి పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్, క్షిపణి దాడిని సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టడంతో పాటు 'కాల్పు విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు తగిన సమాధానం ఇచ్చాం ' అని భారత సైన్యం శుక్రవారం ధృవీకరించింది. #ఆపరేషన్ సిందూర్ లో భారత సాయుధ దళాలు వేగంగా ప్రతిస్పందించాయి.
పాకిస్తాన్ కు చెందిన హచ్ క్యూ ఇంటిగ్రేటె...




