Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
HCU : NIRF Rankings 2025 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో ఐదో స్థానం
career

HCU : NIRF Rankings 2025 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో ఐదో స్థానం

Hyderabad Central University (HCU) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే "NIRF (National Institutional Ranking Framework) 2025" ర్యాంకింగ్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్ ద్వారా విద్యా సంస్థల నాణ్యత, ఫ్యాకల్టీ, పరిశోధన, విద్యార్థుల పనితీరు వంటి అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకులను కేటాయిస్తారు. అయితే ఈ ఏడాది విడుదలైన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో 5వ స్థానాన్ని HCU దక్కించుకుంది. ఇది తెలంగాణలో నంబర్ వన్ కేంద్ర విశ్వవిద్యాలయం కావడమే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. టాప్ 10 విశ్వవిద్యాలయాలు : IISc బెంగళూరు JNU, ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ BHU, వారణాసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కలకత్తా...
సివిల్స్ 2026: ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం – Free Coaching
career

సివిల్స్ 2026: ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం – Free Coaching

Free Coaching | సివిల్స్ ప‌రీక్ష‌ల కోసం సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. శిక్షణ కోసం ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం రాష్ట్రంలోని ఎస్టి, ఎస్సి, బిసి అభ్యర్ధులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్ర‌త్యేక శిక్ష‌ణ (Free Coaching) ప్రారంభించ‌నుంది. ఈమేర‌కు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్సియల్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన రాష్ట్ర ఎస్టి. ఎస్సి., బిసి అభ్యర్ధుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్ధులు ఆబ్జెక్టివ్ టైపు, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించొద్దు. అభ్యర్థులు http://...
Plane Crash | విమాన‌ శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డ్‌..?
Crime

Plane Crash | విమాన‌ శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డ్‌..?

Air India Ahmedabad Plane Crash Live Updates : ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటి.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI171 గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది, విమానంలో 241 మంది మరణించారు. శుక్రవారం ఉదయం విమానయాన సంస్థ ప్రాణనష్టాన్ని నిర్ధారించింది. Plane Crash : ప్రమాద తీవ్రత: 1000 డిగ్రీల సెల్సియస్ మంటలు ప్రమాదానికి (Air India Plane Crash) కారణమేంటంటే దానిపై స్పష్టత ఇప్ప‌టివ‌ర‌కు రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి ప‌లు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటన స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు స‌మాచారం. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు వైద్యకళాశాల హాస్టల్‌లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహా...
భారీగా IAS అధికారుల బదిలీలు |  జాబితా ఇదే.. IAS transfers
State, Hyderabad

భారీగా IAS అధికారుల బదిలీలు | జాబితా ఇదే.. IAS transfers

IAS transfers in Telangana 2025 | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, దిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా దాస‌రి హరిచందన, టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర...
Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు
Crime

Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు

Lightning strike incident in Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌కృతి క‌న్నెర్ర చేసింది. గురువారం జరిగిన మూడు వేర్వేరు పిడుగుపాటు సంఘటనలలో ఆరుగురు రైతులు (వారిలో నలుగురు మహిళలు) ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి, ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేలా గ్రామంలో ఉదయం మొదటి పిడుగుపాటు సంభవించింది.. ఈ ఘ‌ట‌న‌లో పొలాల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. కొద్దిసేపటికే, గాధిగూడ మండల పరిధిలోని పిప్రి గ్రామంలో మరో ఘటన జరిగింది, ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత, కుమ్మరి తండాలో మరో పిడుగుపాటు సంభవించి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అంద‌రూ వ్య‌వ‌సాయ కూలీలే.. ఈ ఘటనలో గాయపడిన ఐదుగుర...
error: Content is protected !!