చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి 21 మంది మృతి – Chevella Road Accident
Chevella Road Accident | హైదరాబాద్, బీజాపూర్ జాతీయ రహదారిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులోనే కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మూడు జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని జాగ్రత్తగా బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులో నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు తాండూరు నుంచి ...




