Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!
హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్!
హైదరాబాద్ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో 'మానవబాంబు' బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు.
Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది?
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. "విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం" అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి..
ముంబైలో కట్టుదిట్టమైన భద్రత
ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమ...




