Avatar 3 release date | జేమ్స్ కెమెరూన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది.. ఆయన తీసిన మూవీలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొడతాయి. రాంబో, టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో దేశవిదేశాల్లోని చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశాడు.
అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు పట్టింది. ఇంతకుముందు వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ భారత్ లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు అవతార్ సిరీస్ నుంచి రెండు చిత్రాలు రాగా, ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది.
గత రెండు సినిమాల మాదిరి అవతార్ 3 (Avatar 3) ని కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జేమ్స్ కెమెరాన్ ఈ సారి మునుపెన్నడి చూడని పండోరాను చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నహాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం మార్వెల్ ‘ఫెంటాస్టిక్ ఫోర్’తో పాటు జత చేసి విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో రెండు సీక్వెల్స్ కూడా తెరకెక్కబోతున్నాయి. 2029లో, 2031లో రెండు సినిమాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పంచ భూతాల కాన్సెప్టుతోనే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది కదా.. ఇప్పటి వరకు నేల, నీరు, ఇప్పుడు నిప్పు కాన్సెప్ట్ ను తీసుకువస్తున్నాడు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.