రూ.2 లక్షలకు సోలాపూర్ వ్యక్తికి విక్రయం
Baby Girl Sold : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆడ శిశువును విక్రయించిన ఘటన కలకలం రేపింది. ఐదో సంతానంగా ఆడ శిశువు పుట్టిందని, తాము పోషించలేమని స్వయంగా తల్లిదండ్రులే విక్రయించారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తిలో బేరం కుదుర్చుకొని అమ్మినట్టు సమాచారం. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. ఐదో సంతానంగా పుట్టిన ఆడ శిశువును అమినట్లు స్థానికులకు అనుమానం రావడంతో వెంటనే వారు చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టింది.
కాగా శిశు విక్రయంపై మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ పోలీసులు వెల్లడించారు. అమ్ముడైన శిశువును అధికారులు తిరిగి చేరదీసి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆడపిల్లలను పోషించలేమనే ఆందోళనతో ఇలాంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.