Baldness treatment : హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ ప్రాంతమైన చందూలాల్ బారదరిలో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. బట్టతలపై జట్టు పెరిగేలా చేస్తానని (Baldness treatment) ఓ బార్బర్ చేసిన ట్రీట్మెంట్ హాట్ టాపిక్‌గా మారింది.
గుండు చేసి… మందు రాసి
ఢిల్లీకి చెందిన ఒక యువ బార్బర్ షకీల్ సల్మానీ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ( social media influencer barber ) కూడా. తాను తలపై మళ్లీ జుట్టు పెరగే విధంగా మందు తయారు చేశానని అతడు ప్రచారం చేశాడు. దాన్ని తలపై రాస్తే తిరిగి జట్టు వస్తుందని నమ్మబలికాడు. తాను పనిచేస్తున్న “బిగ్ బాస్ సెలూన్” (ఫతే దర్వాజా రోడ్) వద్ద ఈ ప్రక్రియ మొదలు పెట్టాడు. హెయిర్ రీగ్రోత్ కోసం వచ్చే వారికి మొదట గుండు చేసి, ఆ తర్వాత ఒక తెల్లటి లోషన్ (Hair regrowth lotion)ను తలపై బ్రష్‌తో అప్లై చేసేవాడు.
Baldness treatment : సోషల్ మీడియాలో ప్రచారం
వకీల్ తన హెయిర్ రీగ్రోత్ ట్రీట్‌మెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ ట్రీట్‌మెంట్‌తో అనేక మందికి జట్టు తిరిగి వచ్చిందంటూ వీడియోలు, రీల్స్ పోస్ట్ చేశాడు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల నుంచి యువకులతోపాటు వృద్ధులు సైతం అటు వైపు పరుగులు పెట్టారు. ఇలా రోజుకు క్లయింట్ల సంఖ్య 100 నుంచి 150కు పెరిగింది. స్థానికులు మాట్లాడుతూ “ గుండు చేసేందుకు వంద రూపాయలు తీసుకుని, మందు అప్లై చేయడం మాత్రం ఉచితంగానే చేస్తున్నాడు. పైగా మందుకు డబ్బులు తీసుకుంటే అది పని చేయదని చెబుతున్నాడు” అని తెలిపారు.
టెంట్ వేసుకొని శిబిరం ఏర్పాటు
హెయిర్ రీగ్రోత్ కోసం వందలాది మంది కార్లు, ఆటోలు, బైకులపై రావడంతో ఫతే దర్వాజా రోడ్‌పై ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. స్థానికులు అసహనంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చే క్లయింట్లకు షాపు సరిపోకపోవడంతో కొద్దిదూరంలో షకీల్ టెంట్ వేసుకొని శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
Baldness treatment : చివరకు ఏమైందంటే..
ఇవన్నీ బాగానే సాగుతున్నాయని అనుకుంటుండగానే హెయిర్ రీగ్రోత్ ట్రీట్‌మెంట్ వికటించడం (Hair lotion side effects) మొదలెట్టింది. మందు రాసిన కొందరికి తలపై పుండ్లు మొదలయ్యాయి. దీంతో ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రులను ఆశ్రయించారు. ఈ వార్త వైరల్ (Hair loss scam viral news) కావడంతో వకీల్ సల్మానీ బెదిరిపోయి తన సలూన్ మూసి పారిపోయాడు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








