Banned registration : రంగరెడ్డి జిల్లా (Ranga Reddy district)లోని మాదాపూర్, శేరిలింగంపల్లి (Madhapur in Serilingampally) మండలాల్లోని కొన్ని భూముల రిజిస్ట్రేషన్ల (banned registration)ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government ) నిషేధించింది. ఇవి ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. ఇది అక్కడి భూ యజమానులను ఆందోళన కలిగిస్తోంది. ఈ భూములు (Plots) హైటెక్ సిటీ, స్టార్ హోటళ్లు, వాణిజ్య కాంప్లెక్స్‌లు, ఇతర వ్యాపార సంస్థల సమీపంలో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ స్కైస్క్రేపర్లు, మల్టీ స్టోరీ భవనాలు నిర్మించగా, కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పత్రికానగర్ (Patrika Nagar) ప్రాంతంలో జర్నలిస్టులు (journalists) కొన్న 20 ఎకరాల స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయి.
భూములు కొన్నవారికి షాక్
ఈ భూములను కంచా ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు, ఖరిజ్ ఖాతా భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి వచ్చేవిగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇవన్నీ నిషేధిత జాబితా ( (Prohibited list)లోకి చేరాయి. ప్రస్తుతం మాదాపూర్ (Madhapur) ప్రాంతంలో ఒక్క స్క్వేర్ యార్డ్ ధర రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. ఈ నిర్ణయం పత్రికా నగర్‌లో స్థలాలు కొనుగోలు చేసిన వారికి పెద్ద షాక్‌గా మారింది. వారు రంగారెడ్డి కలెక్టరేట్‌ను, రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తూ తమ స్థలాలను నిషేధ జాబితా నుంచి తొలగించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
హైదరాబాద్ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు రంగారెడ్డి కలెక్టర్ లేఖ రాశారు. ఇందులో కొన్ని సర్వే నంబర్లలో భూముల రిజిస్ట్రేషన్‌ను నిషేధించాలని కోరారు. మాదాపూర్ గ్రామంలో నిషేధిత భూముల్లో 645.16 ఎకరాల కంచా ప్రభుత్వ భూమి, 5.25 ఎకరాల పోలీస్ డిపార్ట్‌మెంట్ పొరంబోకు భూమి ఉన్నాయి.
Banned registration : నిషేధిత భూముల సర్వే నంబర్లు
- పొరంబోకు భూములు: 1, 17
-ఖరిజ్ ఖాతా భూములు: 50, 50A, 50E - అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద: 73/1, 74, 75, 12/P to 15, 43, 44/1, 26, 27, 28, 29, 80, 81, 82, 83, 84, 31/1, 32, 33, 34, 35, 36, 62, 71, 72, 76/1, 3, 4, 10, 18/1, 19/1, 48, 7/1, 7/2, 8/1, 8/2, 8/6, 11/1, 11/2, 9/1, 9/2, 79, 65, 66/1, 67, 2, 5, 16, 45 to 47, 49, 55 to 59, 85, 86, 20 to 25, 42, 88/2, 77, 78, 31 to 41.
భూయజమానుల ఆందోళన
ఈ ఉత్తర్వులు జనవరిలోనే జారీ అయినప్పటికీ ఇటీవలే ఇది బహిరంగంగా వెలుగులోకి వచ్చింది. దీంతో భూ యజమానులు రంగారెడ్డి కలెక్టర్ (Ranga Reddy District Collector)ను కలిసి తమ భూములను నిషేధ జాబితా (prohibited list) నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఒక స్థల యజమాని మాట్లాడుతూ “మేము మా ప్లాట్‌ను చాలా ఏళ్ల క్రితమే కొనుగోలు చేశాం. అన్ని పన్నులు కడుతున్నాం. ఇల్లు నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై వివాదం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరో అయప్ప సొసైటీ వివాదంలా మారుతుందని, ఇది ప్లాట్ యజమానుల (plot owners)కు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఇది ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) ద్వారా అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నమని అంటున్నారు.
యాజమాన్య హక్కులు దక్కేనా?
ఇదేక్రమంలో, తెలంగాణ ప్రభుత్వం అక్రమ లేఔట్లపై కొత్త రిజిస్ట్రేషన్ నిబంధనలు అమలు చేసింది. 2020 ఆగస్టు తర్వాత అభివృద్ధి చేసిన అక్రమ లేఔట్లకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిషేధిత భూముల యజమానులు తమ హక్కులను రక్షించుకునేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..