Sarkar Live

Begumpet Airport | గుడ్ న్యూస్.. ఇక బేగంపేట ఎయిర్‌ పోర్ట్ కు మ‌హ‌ర్ద‌శ‌..

Begumpet Airport : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ఇక్క‌డి నుంచి వాణిజ్య ప్రయాణాల (commercial flights)ను మ‌ళ్లీ ప్రారంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)ను పున‌రుద్ధరించే అంశంపై కేంద్ర పౌర విమాన‌యాన మంత్రి కె.రామ్మోహ‌న్

Begumpet Airport

Begumpet Airport : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ఇక్క‌డి నుంచి వాణిజ్య ప్రయాణాల (commercial flights)ను మ‌ళ్లీ ప్రారంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)ను పున‌రుద్ధరించే అంశంపై కేంద్ర పౌర విమాన‌యాన మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడు (Union civil aviation minister K Ram Mohan Naidu) సంకేతాలు ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం భారత వైమానిక దళానికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైంది. ఈ క్ర‌మంలో ఇక్క‌డి నుంచి మరోసారి సామాన్య ప్రజలకు వాణిజ్య విమాన సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తేవాల‌ని కేంద్రం ప్ర‌ణాళిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

బేగంపేట విమానాశ్రయం చరిత్ర

Begumpet Airport History : బేగంపేట విమానాశ్రయం 1930లో నిర్మిత‌మైంది. నిజాం పాలనలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జ‌రిగింది. అప్పటి నుంచి వ్యాపార విమానయానంతోపాటు అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా దీని (Begumpet Airport) సేవ‌లు అందాయి. అయితే.. 2008లో షంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన త‌ర్వాత బేగంపేట విమానాశ్రయం వాణిజ్య విమానాలను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఇది ప్రధానంగా విమానయాన శిక్షణ కార్యక్రమాలు, ప్రైవేట్ జెట్‌లకు మాత్రమే ఉప‌యోగ‌ప‌డుతోంది. బేగంపేట విమానాశ్రయాన్ని తిరిగి వాణిజ్య ప్రయాణాలకు అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపడంతో ఈ ఎయిర్‌పోర్టు పున‌రుద్ధ‌ర‌ణ‌పై ఆశ‌లు చిగురిస్తున్నాయి.

పున‌రుద్ధ‌ర‌ణ ప్రయోజనాలు ఏమిటి?

ప్రస్తుతం శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) నగరం నుంచి దూరంగా ఉండటం వల్ల ప్రయాణ సమయం ఎక్కువ అవుతోంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే ముఖ్యంగా బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్ ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభంగా మారుతుంది. ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న నేప‌థ్యంలో కొత్తగా నిర్మాణ ఖర్చులు పెద్దగా అవసరం ఉండదు. కేవలం ఆధునికీకరణ మాత్రమే అవసరమ‌వుతుంది. హైదరాబాద్ వ్యాపార కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం తిరిగి ప్రారంభమైతే కార్పొరేట్ ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

Begumpet Airport : భిన్నాభిప్రాయాలు

ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం తిరిగి వాణిజ్య సేవలకు తెరుచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ప్రయాణికుల సౌలభ్యం, నగర అభివృద్ధికి ఇది ఎంతవరకు తోడ్పడుతుందో సమీక్షించి, అధికారికంగా నిర్ణయం వెలువడనుంది. అయితే.. బేగంపేట విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించాలనే ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రయాణికులు ఇది నగరానికి మరింత అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. మ‌రికొంద‌రు షంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తున్నందున కొత్తగా ఎయిర్‌పోర్ట్‌ను తెరవడం అవసరమా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ ఎయిర్‌పోర్టును పున‌రుద్ధ‌రిస్తే బేగంపేట పరిస‌రాల్లో శ‌బ్ద కాలుష్యం పెరుగుతుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్-శ్రీశైలం సీప్లేన్ సేవలు

కేంద్ర ప్రభుత్వం మరో ఆసక్తికరమైన ప్రణాళికను సిద్దం చేస్తోంది. హైదరాబాద్‌-శైలం మధ్య అంబిఫియస్ సీప్లేన్ సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సీప్లేన్లు నీటిపై కూడా ల్యాండ్ అవుతాయి. ఇది పర్యాటకులను మరింత ఆకర్షించొచ్చు.

మామునూర్ విమానాశ్రయం పునరుద్ధరణ

Warangal Airport : వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయాన్ని (Mamunoor airport) తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్టు 1930లో నిర్మిత‌మైంది. స్వాతంత్య్రం త‌ర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇక్క‌డి నుంచి సేవ‌లు అందాయి. 1981 తర్వాత దీనిని పూర్తిగా మూసివేశారు. ఇప్పుడు దీన్ని తెలంగాణలో రెండో ముఖ్యమైన విమానాశ్రయంగా మార్చేందుకు ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త‌గూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్

తెలంగాణలో మరో విమానాశ్రయాన్ని(Kothagudem Airport) అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త‌గూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్ కోసం ప్రణాళికలు రూపొంచారు. వాతావరణ అనుకూలతలు, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?