Vande Bharat Express | ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో విజయవంతమయ్యాయి. చాలా చోట్ల 100 శాతం వరకు ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా వందేభారత్ స్పీపర్ (Vande Bharat Express Sleeper ) రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. సుదూర ప్రయాణాలు చేసే వారు ఈ స్లీపర్ వందేభారత్ రైళ్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల ఆశలకు అనుగుణంగా ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో చైర్‌కార్ వందే భారత్ రైళ్లను కూడా రైల్వేశాఖ కొన్ని మార్గాల్లో ప్రారంభించనుంది.
Vande Bharat Express : ప్రయాణికుల వినతి మేరకు
మరోవైపు ఎక్కువ ఆక్యూపెన్సీతో నడుస్తున్న రైళ్లను మరికొద్ది దూరం పాటు పొడిగించేందుకు భారతీయ రైల్వే చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ తొలివారంలో బెంగళూరు-బెల్గాం (Belgaum) వరకు వందేభారత్ సెమీహైస్పీడ్ రైలు (Vande Bharat Express) నడువనుంది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బెల్గాం వరకు పొడిగించి నడపాలని ప్రయాణికుల నుంచి వచ్చిన మేరకు.. రైల్వేశాఖ కొత్త ప్రణాళికలు రూపొందించింది. దాంతో చాలా మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుం
ఏప్రిల్ నుంచి బెల్గాం-బెంగళూరు (Bengalugu) మధ్య వందే భారత్ నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. బెంగళూరు నుంచి ధార్వాడ్ నుంచి బెల్గాం వరకు వందే భారత్‌ను నడపాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టార్ ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విన్నవించారు. ధార్వాడ్ నుంచి బెల్గాం మధ్య వందే భారత్ రైలు ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయింది. దీని కోసం బెల్గాం స్టేషన్‌ను సైతం పునరుద్ధరణపనులు కొనసాగిస్తున్నారు. బెల్గాం నుంచి బెంగళూరు వరకు నడిచే వందే భారత్ రైలుకు 20661-20662 నంబరును కేటాయించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








