Isha Ambani : భారతదేశ దిగ్గజ వ్యాపారి, అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఇటీవల ముంబై వీధుల్లో బెంట్‌లీ బెంటేయ్గా SUV (Bentley Bentayga SUV) లో కనిపించారు. ఈ కారును ప్రత్యేకమైనది… అద్భుత ఫీచర్స్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా సూర్యకాంతిలో దానంతట అదే ఆటోమెటిక్‌గా రంగులను మార్చుకుంటుంది. దీని ధర కోట్లలోనే ఉంటుంది. విలాసవంత జీవితం గడుపుతున్న అంబాని కుటుంబంలో ఉన్న అత్యధిక ఖరీదైన కార్ల జాబితాలో ఇది కూడా వచ్చి చేరింది.
అత్యంత ఖరీదైన కారు
ఇషా అంబానీ బెంట్‌లీ బెంటేయ్గా V8తో ఇటీవల నటుడు రణబీర్ కపూర్ నివాసం వద్ద కనిపించింది. ఆమె వద్ద మెర్సిడెస్ G-వాగన్, ఇతర విలాసవంతమైన వాహనాలు కూడా ఉన్నాయి. కొత్తగా ఆమె కొన్న కారు మరింత విలాసమైనది. అత్యధిక ఖరీదైనది.
రంగులు ఎలా మార్చుకుంటుందంటే..
ఇషా అంబానీ (Isha Ambani)కి చెందిన బెంట్‌లీ బెంటేయ్గా మొదట తెలుపు రంగులో ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన ఇరిడిసెంట్ ర్యాప్ ఉంది. ఈ ర్యాప్ కారును నీడలో నలుపు లేదా గాఢ ముదురు బ్రౌన్‌గానూ.. సూర్యకాంతిలో నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులుగానూ మార్చేలా చేస్తుంది. ఈ ర్యాప్‌లో రంగులను మార్చే డివైజ్‌లో పలుచటి పారదర్శక ఫిల్మ్ ఉంటుంది. కాంతి ఆ ఫిల్మ్‌పై ప్రతిఫలిస్తే, కణాలు వివిధ రంగుల కాంతిని చిమ్ముతాయి. దీంతో కారు అద్భుతంగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. ఈ టెక్నిక్‌ను కలర్ షిఫ్టింగ్ ర్యాప్ అంటారు. ఇటీవల ఇదెంతో ప్రాచుర్యం పొందుతోంది.
ఇషా అంబానీ కారు ధర.. స్పెసిఫికేషన్లు
ఇషా అంబానీకి చెందిన బెంట్‌లీ బెంటేయ్గా V8 ధర సుమారు రూ. 4 కోట్లు. ఇరిడిసెంట్ ర్యాప్ కూడా ఖరీదైన కస్టమైజేషన్, ఇది లగ్జరీ SUVకు ప్రత్యేకతను జోడిస్తుంది. ప్రతి కోణంలో కూడా ఈ కారు వేర్వేరు రంగులో కనిపిస్తోంది. ఇది ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇషా అంబానీ .. కార్ల సేకరణ
లగ్జరీ కార్ల సేకరణకు అంబానీ కుటుంబం ప్రసిద్ధి. తమ వాహనాలను ప్రత్యేకంగా కనిపించేలా ర్యాప్స్‌పై భారీగా ఖర్చు పెడుతుంటారు. ఇషా అంబానీ ఇటీవల కొన్న బెంట్‌లీ బెంటేయ్గా అలాంటిదే. విలాసవంతమైన, అత్యంత ఖరీదైన కార్లను కొనడం ఇషా అంబానీ హాబీ. ఆమె కలెక్షన్‌లో కలర్-షిఫ్టింగ్ ర్యాప్‌తో కూడిన రోల్స్-రాయిస్ కల్లినన్ కూడా ఉంది. ఇది ప్రత్యేకమైన లగ్జరీ కార్లపై ఆమెకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..