Bhairavam Teaser Released : మిరపకాయ్, రామయ్య వస్తావయ్య, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా దువ్వాడ జగన్నాథం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నాంది సినిమాతో డైరెక్టర్ గా మారి ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో మూవీ తనతోనే ఉగ్రం అనే మూవీ తీశారు.
2012లో భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన సుడిగాడు మూవీ తో హిట్టు కొట్టిన అల్లరి నరేష్ దాదాపు 11 సంవత్సరాలు తను తీసిన సినిమాలన్నీ ప్లాఫ్ అయ్యాయి. చాలా సంవత్సరాల తర్వాత నాంది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు.
వరుసగా రెండు భారీ హిట్లు కొట్టిన విజయ్ కనకమేడల మూడో మూవీ భైరవం (Bhairavam Movie) చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే రాధ మోహన్ నిర్మిస్తున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితి శంకర్, దివ్యా పిల్లై, ఆనందీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈరోజు మేకర్స్ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.
అంతకుముందు ఈ మూవీ లోని హీరోల ఫస్ట్ లుక్ , ఒక సాంగ్ రిలీజ్ అయి మూవీ పై మంచి బజ్ ఏర్పడింది. మంచి మంచి హిట్ సాం గ్స్ రాసి ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ కి సాంగ్స్ తనే రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసిన శ్రీ చరణ్ పాకాల ఇటీవలే కేసీఆర్ అనే మూవీతో హిట్టుకొట్టారు. ఇప్పుడు భైరవ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.
Bhairavam Teaser : ఆసక్తికరంగా భైరవం టీజర్
ఇదిలా ఉండగా జయసుధ వాయిస్ తో ఈ టీజర్ మొదలవుతుంది. రాత్రి నాకు ఓ కల వచ్చింది. చుట్టు తెగిపోయిన తలలు, మొండాలు…. దూరంగా మృత్యువు తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడురా శీను…అని తను పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్తుంటే హీరోలు విలన్ లను నరికేస్తుంటారు.
అలాగే’ శీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా అదే వాడి జోలికి ఎవడైనా వస్తే నా కొడక ప్రాణాలు తీస్తా ‘ అంటూ మనోజ్ చెప్పిన డైలాగ్ వింటే చాలా రోజుల తర్వాత తను ఒక మంచి రోల్ లో కనబడతారని తెలుస్తోంది. ‘ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ శీనుగాడు ఉన్నాడు ‘ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్ ఈ మూవీపై అంచనాలను పెంచేసింది.
ఈ మూవీ ఒక యాక్షన్ డ్రామాగా వస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు హీరోలు కూడా పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు. నిమిషం 27 సెకండ్లు ఉన్న టీజర్ లో శ్రీ చరణ్ ఇచ్చిన బీజీఎం, టీజర్ లాస్ట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన యాక్టింగ్ హైలెట్.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..