Telangana Rythu Bharosa | నిరుపేద కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ పథకాన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూమి లేని నిరుపేదకు రూ. 12వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka Mallu ) ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఇచ్చే 12వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు.
రైతు భరోసాపై కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఏ హామీనీ మరిచిపోలేదని చెప్పారు. ముఖ్యంగా రైతులకి హామీలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల కోసం ఉద్దేశించిన వివిధ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.50,953 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ఉపముఖ్యమంత్రి భట్టి పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వంపై కొందరు గాలిమాటలు మాట్లాడుతూ.. అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ (BRS) రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి చేసిన మంచి పని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మండిపడ్డారు.అప్పులు పాలు చేసి ఇప్పుడు మాత్రం ఆర్థిక వ్యవస్థపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] మారబోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణను గ్రీన్ […]