రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తుల స్వీకరణకు ముమ్మర ఏర్పాట్లు
Bhu Bharathi seminars List | హైదరాబాద్ : గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీవరకు రాష్ట్రంలోని జిల్లాకు ఒక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
Bhu Bharath : భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం..
భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృత స్ధాయిలో అవగాహన కల్పించడంతోపాటు. ఆయా మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడమే ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి కలెక్టర్ రెవెన్యూ సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
భూ భారతి అమలవుతున్న 28 మండలాల వివరాలు
- ఆదిలాబాద్ – భరోజ్
- భద్రాద్రి కొత్తగూడెం – సుజాతనగర్
- హనుమకొండ – నడికూడ
- జగిత్యాల – బుగ్గారం
- జనగాం – స్టేషన్ ఘన్‌పూర్
- జయశంకర్ భూపాలపల్లి – రేగొండ
- జోగులాంబ గద్వాల్ – ఇటిక్యాల్
- కరీంనగర్ – సైదాపూర్
- కొమరంభీం ఆసిఫాబాద్ – పెంచికల్‌పేట్
- మహబూబాబాద్ – దంతాలపల్లి
- మహబూబ్ నగర్ – మూసాపేట్
- మంచిర్యాల – భీమారం
- మెదక్ – చిల్పిచిడ్
- మేడ్చల్ మల్కాజిగిరి – కీసర
- నాగర్‌కర్నూల్ – పెంట్లవల్లి
- నల్గొండ – నక్రేకల్
- నిర్మల్ – కుంతాల
- నిజామాబాద్ – మెండోరా
- పెద్దపల్లి – ఎలిగేడ్
- రాజన్న సిరిసిల్ల – రుద్రంగి
- రంగారెడ్డి – కుందుర్గ్
- సంగారెడ్డి – కొండాపూర్
- సిద్దిపేట – అక్కన్నపేట
- సూర్యాపేట – గరిడేపల్లె
- వికారాబాద్ – ధరూర్
- వనపర్తి – గోపాలపేట
- వరంగల్ – వర్దన్నపేట
- యాదాద్రి భువనగిరి – ఆత్మకూర్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    