Mother kills husband and daughter : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లా చిట్యాల మండలం వొడితల గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త పక్షవాతంతో మంచాన పడిపోవడంతో సపర్యలు చేయాల్సిన భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం బయటపడిపోతుందనే భయంతో, ఆమె ప్రియుడి సాయంతో భర్తతో పాటు తన 22 ఏళ్ల కూతురును కూడా కడతేర్చింది.
వివరాల్లోకి వెళ్తే, జూన్ 25న కవిత తన భర్తను హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంది. అయితే, తమ సంబంధం విషయం కుమార్తెకు కూడా తెలిసిపోతుందనే భయంతో 22 ఏళ్ల కూతురినీ పక్కా ప్లాన్ వేసి హత్య చేసింది.
కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి–కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, ఆధార్ కార్డు ఉంచి, క్షుద్రపూజల వల్లే చనిపోయిందనే ఊరి జనాన్ని నమ్మించే యత్నం చేసింది.
అయితే కవిత ప్రవర్తనపై పోలీసులకు అనునానం వచ్చింది. దీంతో లోతుగా దర్యాప్తు జరపగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల క్రితమే ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురినీ హత్య చేసినట్లు కవిత పోలీసుల విచారణలో ఒప్పుకుంది. మరో హత్య చేయాలని కూడా ప్లాన్ వేసిందని తెలిపింది. కాగా ప్రస్తుతం కవిత, ఆమె ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    