Bhuvanagiri : భువనగిరిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (BRS Party Office) పై కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న దాడి చేసిన నేపథ్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. బీఆర్ఎస్ బంద్(Band)కు పిలుపునిస్తూ మహాధర్నాకు ఉపక్రమించగా పోలీసులు అనుమతించలేదు. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మహాధర్నా ప్రదేశం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణమంతా భారీ బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
ఎక్కడికక్కడే కట్టడి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెర్ల రామకృష్ణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు (Congress Leaders) నిన్న (శనివారం) దాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్డెక్కి నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ రోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల బంద్‌కు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. భువనగిరిలో మహాధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు తెల్లవారుజాము నుంచే హౌస్ అరెస్టులు (House Arrest) చేసింది. బీఆర్ఎస్ నాయకులు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
Bhuvanagiri లో భారీ బందోబస్తు
బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల నేపథ్యంలో భువనగిరి, ఆలేరు(Aler)లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భువనగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యాలయాలకు వెళ్లే రహదారులను బ్లాక్ చేశారు. రోడ్లపై అడుగడుగునా భారీ బలగాలు మోహరించాయి. ధర్నా ప్రదేశంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భంగం కలిగించడానికి ప్రయత్నించే ఎవరిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు హెచ్చరికలు జారీ చేశారు.
గులాబీ నేతల గుస్సా
తమ కార్యాలయం దాడి చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమపైనే దౌర్జన్యం చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పోలీసులు ఉగ్రవాదుల్లా చూస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








