Tollywood News : సంక్రాంతి వస్తుందంటేనే పెద్ద హీరోలు సినిమాలతో రెడీగా ఉంటారు.పండుగకు వారి మధ్య పోటీ ఉంటుంది. ప్రతి సంక్రాంతి లాగే ఈ సంవత్సరం కూడా మూడు సినిమాలు పోటీపడ్డాయి. గేమ్ చేంజర్ (Game Changer), డాకు మహారాజ్ (Daaku maharaj),సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలతో ముగ్గురు పెద్ద హీరోలు వచ్చారు. ఈ మూడు సినిమాల్లో జనాల్లో సంక్రాంతి విన్నర్ అనిపించుకున్న మూవీ ఏంటో ఒకసారి చూద్దాం…
మొదట ఈనెల 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan)కీయారా అడ్వాని కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.మూవీలో అంజలి పాత్ర పర్వాలేదనిపించినా.. డైరెక్టర్ ఎమోషన్స్ ని సరిగ్గా క్యారీ చేయకపోవడంతో ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు.
ఎస్ జె సూర్య, శ్రీకాంత్ పాత్రలు బాగున్నా మిగతా యాక్టర్స్ ని సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు కూడా వచ్చాయి. సూపర్ హిట్ సాంగ్ నానా హైరానా మొదటి రోజు థియేటర్లో రాకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. తర్వాత రోజు మూవీలో ఈ సాంగ్ యాడ్ చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ కూడా అంతంత మాత్రమే ఉండడం సీన్లు ఫాస్ట్ గా ఏదో హడావిడిగా నడుస్తుండడం ఈ సినిమాకు నెగిటివ్ టాక్ నే తెచ్చి పెట్టింది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగున్న సినీప్రియులందరిని అలరించలేకపోయింది. వింటేజ్ శంకర్ మార్క్ మిస్ అవ్వడంతో సినిమాను యావరేజ్ గా తేల్చేశారు.
తర్వాత రెండు రోజులకు జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ మూవీ మొదటి రోజే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.బాబి డైరెక్షన్, ప్రొడ్యూసర్ నాగదేవర సూర్యవంశి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా నెక్ట్ లెవెల్ కి దూసుకుపోయింది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)సింహ గర్జన, బాబీ డియోల్ విలనిజం వారి మధ్య వచ్చే సీన్లు సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఒక గ్రామానికి నీళ్లు తెచ్చే ఒక ఆఫీసర్ క్యారెక్టర్ ని, విలన్ల కు తిరగబడే డాకు మహారాజ్ క్యారెక్టర్ లో బాలకృష్ణ నటించి ఆడియన్స్ ని మెప్పించాడు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెల్లింది. థమన్ మ్యూజిక్ సినిమా హిట్ అవడంలో మెయిన్ రోల్ పోషించింది. బాలకృష్ణ కెరీర్ లో వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిపోయింది. అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా కూడా ఈ మూవీ నిలిచింది. ఆ డియన్స్ సంక్రాంతి మాస్ బ్లాక్ బస్టర్ మూవీ గా తేల్చారు.
ఈ నెల 14న సంక్రాంతి రోజు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అయింది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh ),ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఈ మూవీలో నటించారు. రిలీజ్ అయిన మొదటి రోజే క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. పండుగ టైటిల్తో వచ్చిన మూవీ నిజంగానే ఒక పండుగలా ఉందని ఆడియన్స్ అంటున్నారు. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఈ మూవీకి ప్లస్ గా మారింది.
Tollywood సంక్రాంతి విన్నర్ ఇదే..
అనిల్ రావిపూడి కామెడీ టేకింగ్ తో వరుసగా ఎనిమిదవ మూవీ హిట్టు కొట్టిన దర్శకుడిగా నిలబడ్డాడు. ప్రతి క్యారెక్టర్ తో కామెడీ చేయిండంతో జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ మూవీని చూడడానికి ఇష్టపడుతున్నారు. పాటలు కూడా అద్భుతంగా ఉండటంతో సినిమా మొదటినుంచి చివరి వరకు ఎంజాయ్ చేసేలా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.
Tollywood లో ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా అలరిస్తోంది.ఈ మూవీనే సంక్రాంతి విన్నర్ అని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 thoughts on “Tollywood : సంక్రాంతి విన్నర్ఆ మూవీనే….”