Bilaspur Train Accident | ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. రాయ్‌గఢ్ నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు లాల్‌ఖండ్ సమీపంలో నిలిచివున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.
రెస్క్యూ బృందాల చర్యలు
ప్రమాద గురించి సమాచారం అందుకున్న వెంటనే SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. బోగీలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గ్యాస్ కట్టర్ల సహాయంతో కోచులను కట్ చేస్తున్నారు. రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని బిలాస్‌పూర్ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ రైలు ప్రమాదంలో మహిళా కోచ్, గార్డు బోగీ పూర్తిగా దెబ్బతిన్నాయి. రాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదం కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. సంఘటనా స్థలంలో కేకలు, ఆర్తనాదాలతో వాతావరణం కలతపెట్టింది. రైల్వే పట్టాలు పూర్తిగా స్తంభించడంతో బిలాస్‌పూర్–కట్ని విభాగంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








