Bird Flu Cases in Telugu States | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసులు వెలుగుచూడడంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana) అలర్ట్ అయింది. చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ వ్యాపారులకు సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లా (Godavari districts)లతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (H5N1– Bird Flu) వైరస్ కారణమని అధికారులు తాజాగా గుర్తించారు.ఈ వ్యాధి తెలంగాణకు కూడా విస్తరించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు కోళ్ల పెంపకం.. చికెన్ కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ()హెచ్చరికలు జారీ చేసింది.
కోళ్లు, ఇతర జంతువుల అనుమానాస్పదంగా మృత్యువాత పడిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం సూచించింది. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ ఫాంల ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ప్లూ వ్యాప్తిపై అవగాహన, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించాలని సర్కారు అధికారులను ఆదేశించింది. జిల్లాలోని కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతే వెంటనే సంబంధిత పశువైద్య అధికారులకుసమాచారం ఇవ్వాలని యాజమానులకు సూచించింది.
Bird Flu : రాష్ట్ర సరిహద్దుల్లో కోళ్ల వ్యాన్ల నిలిపివేత
ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తోంది. రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కోళ్ల లారీలను అడ్డుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే ఎక్కడికక్కడ కోళ్ల వ్యాన్లను నిలిపివేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో గద్వాల జిల్లా (Jogulamba Gadwal) పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రత్యేకంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి వచ్చిన రెండు కోళ్ల లారీలను అక్కడే ఆపి తిప్పి పంపించారు. సోమవారం కూడా ఐదు లారీలను వెనక్కి తిప్పి పంపించినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








