Sarkar Live

Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ అంటూనే విలాస జీవితం.. అర‌వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ధ్వ‌జం

Arvind Kejriwal : అర‌వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ బీజేపీ మంగ‌ళ‌వారం ఒక వీడియో విడుద‌ల చేసింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి రాజీనామా చేసినా ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను కేజ్రీవాల్ ఖాళీ చేయ‌క‌పోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

ARVIND KEJRIWAL

Arvind Kejriwal : అర‌వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ బీజేపీ మంగ‌ళ‌వారం ఒక వీడియో విడుద‌ల చేసింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి రాజీనామా చేసినా ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను కేజ్రీవాల్ ఖాళీ చేయ‌క‌పోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. తాను ఆమ్ ఆద్మీ (సామాన్య మాన‌వుడు) అంటూనే కేజ్రీవాల్ అద్దాల మెడ‌ను క‌ట్టుకున్నార‌ని విమ‌ర్శించింది. ప్రభుత్వం తరఫున ఇల్లు తీసుకోనని చెబుతూనే 7-స్టార్ రిసార్ట్‌ను నివాసంగా మార్చుకున్నారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నివాసంలో ప్ర‌భుత్వ ఖజాను వెచ్ఛించి రూ.1.9 కోట్లతో మార్బుల్ గ్రానైట్, లైటింగ్, రూ.1.5 కోట్లతో మరమ్మతులు, రూ. 35 లక్షలతో జిమ్, స్పాను కేజ్రీవాల్ ఏర్పాటు చేసుకున్నార‌ని మండిప‌డ్డారు. ఒక సామాన్య మ‌నిషిని అని చెప్పుకొనే కేజ్రీవాల్ ప్ర‌జ‌ల సొమ్ముతో విలాస‌వంత జీవితం గ‌డుపుతున్నార‌ని ఆరోపించారు. ఈ భ‌వ‌నానికి సంధించిన వీడియోల‌ను కూడా బీజేపీ నాయ‌కులు విడుద‌ల చేశారు.

కొవిడ్ సంక్షోభంలో కూడా కోట్ల ఖ‌ర్చు : బీజేపీ

కొవిడ్ స‌మ‌యంలో ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డి ప్ర‌జల కోసం చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నులు ఆగిపోయిన‌ప్పుడు కూడా ఆయన త‌న బంగ్లా సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 45 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, దీనికి ఆయ‌న‌కున్న అధికారం ఎక్క‌డిద‌ని బీజేపీ ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడు వీరేంద్ర సచ్దేవా ప్ర‌శ్నించారు.
బీజేపీ నాయ‌కులు చేసిన ఈ ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

ఆడిట్ త‌ర్వాతే మ‌ర‌మ్మ‌తులు : AAP

బీజేపీ ఆరోప‌ణ‌లపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) స్పందించింది. “ఆ భవనం 1942లో నిర్మిత‌మైంది. ఇది పూర్తిగా శిథిలావ‌స్థ‌లో ఉంది. కొన్ని చోట్ల పైకప్పు కూలిపోయింది. ప్రజా పనుల శాఖ (PWD) ఆడిట్ తర్వాతే భవనాన్ని మరమ్మతులు చేయించాం” అని స్పష్టం చేసింది.

మ‌రెక్క‌డ ఉండాలి?

ముఖ్య‌మంత్రిగా రాజీనామా చేసిన కేజ్రీవాల్‌ను అధికారిక బంగ్లాను ఖాళీ చేయ‌మ‌ని బీజేపీ డిమాండ్ చేయ‌డంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రం విమ‌ర్శిస్తోంది. కేజ్రీవాల్‌కు ప్ర‌త్యామ్నాయ నివాసాన్ని కేటాయించ‌కుండా ఉన్న దాన్ని ఖాళీ చేయ‌మంటే ఎలా? అని ప్ర‌శ్నించింది.

త్వ‌ర‌లోనే నివాసాన్ని కేటాయిస్తాం: కేంద్ర మంత్రి

దీనిపై కేంద్ర హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక జాతీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయ‌న‌కు త్వరలోనే ప్రభుత్వం తరఫున కొత్త బంగ్లాను కేటాయిస్తామ‌ని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ‘టైప్ 7’ బంగ్లా కోసం అర్హులు అని, ప్రస్తుతానికి ఆ బంగ్లాలు ఖాళీగా లేవ‌ని అన్నారు. ఖాళీ అయిన వెంటనే అందులో ఒక‌దాన్ని కేటాయిస్తామ‌ని అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  ఎక్స్(ట్విట్టర్)  లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?