Actress attacked : ఓ బాలీవుడ్ నటి (Bollywood actress) హైదరాబాద్ (Hyderabad) మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్ గదిలో దాడికి (attacked) గురైంది. ఒక షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన ఆమెపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన నగదు, విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడగా బాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ వ్యక్తులకు సరైన భద్రత లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
శారీరకంగా హింసించి దోపిడీ
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు హోటల్ గది (hotel room) లోకి అక్రమంగా ప్రవేశించి నటిపై దాడి చేశారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. నటిపై వీరు దాడి చేసి ఆమె వద్ద ఉన్న నగదు, విలువైన ఆభరణాలను దోచుకుని పారిపోయారు. దుండగులు తనను అనైతిక చర్యలకు ఒత్తిడి చేశారని, ఇందుకు తిరస్కరించడంతో కాళ్లూ చేతులు కట్టేసి హింసించారని, అనంతరం తన వద్ద ఉన్న నగదు, ఆభరణాలను తీసుకుని పారిపోయారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు (police complaint)లో ఆమె పేర్కొంది.
దాడికి గురైన నటి ఎవరు?
ఈ బాలీవుడ్ నటి (Bollywood actress) హైదరాబాద్‌లోని ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు వచ్చింది. అయితే హోటల్ గదిలో దాడి కావడం నగరంలోని సినీ ప్రియులను షాక్‌కు గురి చేసింది. ఈ నటి ఎవరనేది పేరు బయటకు రాలేదు. కానీ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అని సమాచారం. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. పోలీసుల ప్రత్యేక బృందాలు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
Actress attacked : ఘటనపై అనేక అనుమానాలు
ఈ ఘటన అనంతరం హోటల్ (hotel) భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు హోటల్ గదిలోకి ఎలా ప్రవేశించారు.. హోటల్ సిబ్బంది ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు.. ముఖ్య అతిథిగా వచ్చిన నటికి భద్రత ఎందుకు లేదు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆ నటి తొలుత బయటికి చెప్పలేదని పోలీసులు తెలిపారు. చెబితే పరువు పోతుందని భావించి ఆమె మౌనంగా ఉందని పేర్కొన్నారు. కానీ అనంతరం సమాజం కోసం నిలబడి నిందితులను శిక్షించాలనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హోటల్ సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ప్రధాన నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
ప్లాన్ ప్రకారం చేసిందేనా?
ఈ ఘటన (Actress attacked)పై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. నటి తన భద్రత కోసం ప్రత్యేక పోలీసు రక్షణ కోరిందా లేదా ఇక్కడి నుంచి వెళ్లిపోయిందా? అన్నది తెలియాల్సి ఉంది. దుండగులు ఎవరు, వీరికి పూర్వపరిచయం ఉందా, ఇది ముందుగా ప్రణాళికతో చేసిన దాడా? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








