Upcoming Telugu Movies 2025 : మాస్ మూవీస్ ను ఓ లెవల్లో తీసే డైరెక్టర్ ఎవరంటే ప్రజెంట్ జనరేషన్ లో బోయపాటి శ్రీను (Boyapati Srinu) అనే చెబుతారు.తెరపై హీరోను మాస్ ఎలివేషన్ లతో ఓ రేంజ్ లో చూపెడుతాడు. ఫస్ట్ మూవీ నుండే ఊర మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ నుండి మూవీ వస్తుందంటే చాలు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.
ఫస్ట్ మూవీ భద్ర (Bhadra) తోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని తులసి (Thulasi) మూవీతో విక్టరీ వెంకటేష్ కు బంపర్ హిట్టును అందించాడు. ఇక బాలయ్య, బోయపాటి కాంబో(Balayya Boyapati combo) సెట్ అయితే చాలు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమనే ఫ్యాన్స్ ఫిక్స్ అయి పోతారు. ప్రజెంట్ వీరిద్దరి కాంబోలో అఖండ 2 (Akhanda 2) తెరకెక్కుతోంది. సెట్స్ పై ఉన్న ఈ మూవీ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
అఖండ సిల్వర్ స్క్రీన్ పై ఎంత హవా చూపించిందో మనకు తెలుసు. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటికే వీరి కాంబోలో సింహా,లెజెండ్ లాంటి మూవీస్ తో భారీ హిట్లు కొట్టారు. ఇక అఖండ లాంటి మూవీ హిట్టు తో హ్యాట్రిక్ కొట్టారు. ఇదిలా ఉండగా అఖండ 2 మూవీ తర్వాత బోయపాటి ఎవరితో మూవీ తీస్తారనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే స్టోరీ లాక్…?
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaithanya) తో మూవీని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినబడుతుంది. ప్రజెంట్ చైతూ కార్తీక్ దండు (Karthik dandu) డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నారు. విరూపాక్ష మూవీతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని చైతూ తో మూవీ సెట్ చేసుకున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే బోయపాటి డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే స్టోరీ లాక్ చేశారని, ఇద్దరి కమిట్మెంట్స్ అయ్యాక సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.
Boyapati Srinu పక్కా మాస్ మూవీతోనే?
బోయపాటి కెరీర్ లో బాలయ్యకు ఇచ్చిన హిట్స్ మరే హీరోకి ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. బాలయ్యకు ఇచ్చిన హిట్టు నాగచైతన్యకు పడితే మాత్రం చైతూ రేంజ్ మరో మెట్టు ఎక్కుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు చైతూ కూడా ఒక పెద్ద డైరెక్టర్ తో పని చేసింది లేదు. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో మూవీ చేయడం తన కెరీర్ కి ప్లస్ అవుతుంది.చైతూ కెరీర్ లో మాస్ ఫిల్మ్స్ చేసినా అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీతో తనలో ఉన్నా మాస్ యాంగిల్ బయటకి వస్తుందని, పక్కా హిట్టు గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.