Brahma anandam Review | టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) ప్రధాన పాత్రలో నటించిన మూవీ బ్రహ్మ ఆనందం (Brahma anandham). రాహుల్ యాదవ్ నిర్మాతగా నిఖిల్ (Nikhil) డైరెక్షన్లో మూవీ తెరకెక్కింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…
Brahma anandam Review కథ విషయానికి వస్తే..
బ్రహ్మానందం(రాజ గౌతమ్) జీవితంలో ఒక లక్ష్యం చేరుకోవాలనుకుంటాడు. తల్లి దండ్రులు లేని అతడు ఒంటరిగానే జీవిస్తాడు.తను రాసిన ఓ నాటిక ఒక షోలో ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది. కానీ వారు చాలా డబ్బులు అడుగుతారు.దాని కోసం ఎదురుచూస్తున్న అతడికి మూర్తి (బ్రహ్మానందం) తనతో ఒక ఊరికి తీసికెళ్ళి తనతో ఉంటే 6 ఎకరాల పొలం రాసిస్తానంటాడు. ఆశపడి బ్రహ్మానందం అతడితో ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ అసలు ఏం జరిగింది. ఆఖరికి అనుకున్నది హీరో అనుకున్నది సాధించాడ లేదా అన్నదే కథ….
తెలుగులో తాతా మనవడు కాన్సెప్ట్ లో సినిమాలు రాక చాలా సంవత్సరాలే అయింది.చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ తో బ్రహ్మ ఆనందం మూవీ (Brahma anandam Review ) తెరకెక్కింది.ఫస్ట్ ఆఫ్ మూవీ బాగానే ఉంది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి కొద్దిసేపు బోర్ కొట్టించిన తర్వాత అసలు కథలోకి వెళ్ళిపోతారు. హీరో రాజా గౌతమ్ బ్రహ్మానందం పాత్రలో పర్వాలేదనిపించాడు. డైరెక్టర్ ఇంకా గౌతమ్ పాత్రను ఇంట్రెస్టింగ్ గా మలిస్తే బాగుండేదనిపించింది. బ్రహ్మానందం ఓల్డ్ ఏజ్ కేరక్టర్ ఈ మూవీకి ప్రధాన బలం.
బ్రహ్మి కనబడితేనే తెలియకుండానే నవ్వేస్తం. అలాంటి బ్రహ్మి ఏడిపించడం అరుదు. ఈ మధ్య రంగ మార్తాండ మూవీలో ఎమోషనల్ కారెక్టర్ చేసి కంట తడి పెట్టించాడు. ఈ మూవీలో కూడా ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టిస్తాడు. బ్రహ్మి మూవీ మొత్తంలో నవ్వించడం తక్కువగానే ఉంటుంది కానీ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో డైరెక్టర్ పర్వాలేదనిపించాడు. బ్రహ్మి పాత్ర ఒక్కటే ఈ మూవీకి ఊపిరిగా నిలిచిందని చెప్పొచ్చు. కానీ మిగితా కేరక్టర్ లను అంతగా పట్టించుకోలేదనిపిస్తుంది.
సెకండ్ ఆఫ్ లో తడబడ్డ డైరెక్టర్
స్టోరీ బాగున్నా దాన్ని డీల్ చేయడంలో డైరెక్టర్ తడబడ్డాడు. ఇంటర్ వెల్ ఎండ్ బాగా తీసిన సెకండ్ ఆఫ్ లో కథపై పట్టు తప్పాడు. కథ పక్కకు పోయి ఏవేవో సీన్లు వచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఎంతో కొంత బాగానే నెట్టుకొచ్చిన డైరెక్టర్ సెకండ్ ఆఫ్ లో పూర్తిగా తేలిపోయాడు.ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకోలేదు. హీరో క్యారెక్టర్ కంటే ఎక్కువగా బ్రహ్మి పాత్రనే బెటర్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మళ్ళీ బ్రహ్మి, సంపత్ కేరక్టర్ లు బాగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్ ని డైరెక్టర్ బాగానే తీశాడనిపించింది. బ్రహ్మి నటన మెచ్చుకునేలా ఉన్నా రాజా గౌతమ్ కి మాత్రం ఈ మూవీ తన కెరియర్ ఎదుగుదలకి ఏ మాత్రం ఉపయోగ పడని విధంగా ఉందని చెప్పొచ్చు. తన పాత్రను ఇంకా బలంగా రాసుకుంటే తన కెరియర్ లో మంచి మూవీ అయిండేది. వెన్నెల కిషోర్ కామెడీ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ప్రియ వడ్లమాని, రాజీవ్ కనకాల, తాళ్లూరి రామేశ్వరి వారి పాత్రల మేరకు బాగానే నటించారు.
శాండల్య పిసపాటి సంగీతం మూవీకి ప్లస్ అనే చెప్పొచ్చు. తన నేపథ్య సంగీతం తో సీన్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కూడా తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ పర్వాలేదనిపించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








