- రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకోగానే కుట్రలు మొదలయ్యాయి..
- “ఎన్నో పుణ్యాల వల్లే కేసీఆర్ కూతురిగా పుట్టా” – కవిత భావోద్వేగం
Kavitha press meet highlights : బీఆర్ఎస్ (BRS) పార్టీలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత (Kavitha) బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. హరీష్ రావు, రేవంత్ ఒకే ఫ్లైట్ లో ఏరోజైతే ఒకే విమానంలో ప్రయాణించారో ఆ రోజు నుంచే తమ కుటుంబం విడిపోవడానికి కుట్రలు ప్రారంభమయ్యాయయని అన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారని, జైలు నుంచి బయటకు రాగానే.. 2024, నవంబర్ 23 నుంచి జనంలోకి వచ్చి పార్టీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నానని తెలిపారు. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం ఉద్యమించానని, మహిళలకు 2500 ఇవ్వాలని పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్లు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
నా మాటలు పార్టీకి వ్యతిరేకం కాదు..
10 నెలల వ్యవధిలో 42 నియోజకవర్గాల్లో పర్యటించానని, పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయాలని కవిత విజ్ఙప్తి చేశారు. తాను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. పార్టీలో ఉన్న కొందరు నాపై కక్షగట్టారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నాఅదే చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
Kavitha : కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం
‘బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?. నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ ఫోన్ కూడా చేయలేదు. మహిళా నాయకురాళ్లు నాపై ప్రెస్‌మీట్ పెట్టారు. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలని కుతంత్రాలు చేస్తున్నారు. భవిష్యత్ లో కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్‌రావుపై విమర్శలు..
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. హరీష్‌రావు రేవంత్ కాళ్లు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్‌రావు పాల వ్యాపారం చేసేవారు.. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి చెబుతారు. కానీ హరీష్‌రావు గురించి మాత్రం మాట్లాడరు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. దానికి హరీష్‌రావు సంతోష్‌రావే కారణం.. కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప మాదిరిగా అంటారు. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, అవసరమా?’ అంటూ కవిత కంటతడి పెట్టుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








