KTR | హైదరాబాద్: ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపంచలేని వ్యక్తికి ఎందుకంత అహంకారం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టేచర్ లేకున్నా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో ముఖ్యమంత్రికి కళ్లు నెత్తికి ఎక్కాయని ఫైర్ అయ్యారు. అసమర్థుడి పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అల్లకల్లోలమయ్యాయన్నారు. ప్రభుత్వం నడపడమంటే డబ్బులు పంచడం కాదని, రాష్ట్ర సంపద పెంచడమని కేటీఆర్ హితువు పలికారు. ఆదాయం లేకపోవడం సమస్య కాదని, రేవంత్ రెడ్డి మెదడులో విషయం లేకపోవడమే అసలు సమస్య అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
‘బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader KTR)విమర్శలు గుప్పగించారు. డబ్బుల సంచులను ఢిల్లీకి పంపిచడానికి బదులుగా.. వాటిని హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు వినియోగించాలని డిమాండ్ చేశారు. . అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అస్తవ్యస్తమైంది. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం?. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడం ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
KTR : ఆర్థికరంగాన్ని చిందరవందర చేశారు
పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కళ్లు నెత్తికెక్కాయి. పదేళ్లు కష్టపడి ఉన్నత స్థితికి చేర్చిన ఆర్థికరంగాన్ని చిందరవందర చేశారు.. తెలంగాణ (Telangana)చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నారు.. ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు ఒక్కో నెల జీతాలు నిలిపివేస్తున్నామని సిగ్గులేకుండా ప్రకటిస్తావా? అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు ప్రభుత్వ పనికిమాలిన తనానికి నిదర్శనం. ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని అవమానించడమే.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. పరిపాలన చేయడం రాక పెంటకుప్పగా మార్చి.. పైగా ఉద్యోగాలు పనిచేయడంలేరని నిందలు వేస్తే ఏ మాత్రం సహించేదని లేదని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








