Sarkar Live

MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు.. Hyderabad : సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే త‌న్నీరు హ‌రీష్ రావు ( BRS MLA Harish Rao ) అన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న

BRS MLA Harish Rao

మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు..

Hyderabad : సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే త‌న్నీరు హ‌రీష్ రావు ( BRS MLA Harish Rao ) అన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని శ‌నివారం మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు మధుసూదన్ చారి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్ తో క‌లిసి ప‌రామ‌ర్శించారు.

తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నద‌ని హ‌రీష్ రావు అన్నారు. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.  వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వెంట‌నే వీరికి మంచి దవాఖానకు పంపించకుండా హాస్టల్‌లో ఉంచి చికిత్స అందించారని తెలిపారు. నాలుగు రోజులు గడించినా కూడా వారు పూర్తి ఆరోగ్యవంతులు కాలేదు. ఆ త‌రువాత విద్యార్థిని లీలావతిని నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో ప్ర‌భుత్వ‌ వైఫల్యం ఇక్కడ కనిపిస్తోంది.  ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ద‌వాఖాన‌ల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

గురుకులల్లో ఫుడ్ పాయిజన్ కార‌ణంగా విద్యార్థ‌ల ప్రాణాలు పోతున్నాయ‌ని ఎన్నిసార్లుచెప్పినా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాను ఎండ‌గడుతున్న ప్రతి పక్ష నాయకులను అడ్డుకుంటున్నారు. సబితా ఇంద్రా రెడ్డిని, సత్యవతిని అరెస్టు చేశారు. దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తు పై లేదా? అని హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. నిన్న నల్గొండ – కేతేపల్లి మండలం గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురై దవాఖాన పాల‌య్యాడు. ఫుడ్ పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులు నిత్య కృత్యమ‌వుతున్నా ప్రభుత్వం ముద్దు నిద్ర వేడడం లేదు. ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోతే ఉలుకు లేదు పలుకు లేదు. ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు. మేము ప్రశ్నిస్తే వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీస్కొని చేతులు దులుపుకుంటున్నారు నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నరు.

పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు. సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు .. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి..  ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు-పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులకు సకాలంలో చికిత్స అందించకపోవడం వారి ప్రాణాల మీదకు వస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణాలు బలిగొంటున్నాయి విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి అని హరీష రావు ప్రశ్నించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?