BRS MLCs Protest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (Legislative Council members of the BRS) వినూత్న నిరసన తెలిపారు. మెడలో మిరపకాయల దండ వేసుకొని శాసన మండలి ఆవరణలో ఈ రోజు ఆందోళనకు దిగారు. మిర్చి రైతుల (chilli farmers)కు మద్దతు ధర రూ. 25 వేలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) నేతృత్వంలో ఈ నిరసన జరిగింది.
BRS MLCs Protest : కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్
తెలంగాణలో గత సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో మిరప సాగు జరిగింది. ఈ ఏడాది మిరప సాగు కేవలం 2.4 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. మిరప ధరల క్షీణతే దీనికి ప్రధాన కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంటున్నారు. ధరలు పడిపోవడం వల్ల రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిర్చి రైతులకు కనీస మద్దతు ధర (minimum support price) ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రాన్ని ఒప్పించాలి: BRS MLCs
కేంద్రాన్ని ఒప్పించి , నాఫెడ్ (NAFED), మార్క్‌ఫెడ్ (MarkFed) ద్వారా కనీస మద్దతు ధరను ప్రకటించి రైతుల నుంచి మిర్చిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కోరారు. ఇప్పటికే మిర్చి రైతులు పలు వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోయారని, మద్దతు ధర లభించకుంటే వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారుతుందని తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
తెలంగాణలో ఉత్పత్తి అయ్యే మిరపను అంతర్జాతీయంగా గుర్తింపుపొందేలా చేయాలని, దీని కోసం ఎగుమతులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే తెలంగాణ మిరపను స్పైసెస్ బోర్డులో ప్రత్యేక ఆహార పంటగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మద్దతుగా నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








