వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో కలకలం రేపిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి అనుమానాస్పద మృతి (Gorrekunta Murder Case) కేసులో దర్యాప్తు మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి సుమారు 45 రోజులు గడిచినప్పటికీ, ఈ హత్య మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కేసులో ఏం జరుగుతోందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది.
జిల్లాలో అత్యంత సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీలను కూడా అవలీలగా ఛేదించిన ట్రాక్ రికార్డు పోలీసు శాఖకు ఉంది. సుమారు ఐదేళ్ల క్రితం గొర్రెకుంట శివారులో ఏకంగా 9 మంది బావిలో శవాలై తేలిన మిస్టరీని చాకచక్యంగా ఛేదించిన ఘనత పోలీస్ శాఖకు ఉంది. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల.రాజు(లవ్ రాజ్ )అనుమానాస్పదంగా మృతి చెంది 45 రోజులు గడిచినా కేసు మిస్టరీ ఎందుకు వీడటం లేదు అన్నది ప్రశ్న.
ఈ కేసులో కీలక ఆధారాలుగా చెప్పుకునే గొర్రెకుంట ,మొగిలిచెర్ల గ్రామాల్లోని సిసి కెమెరాల ఫుటేజ్ లు, మృతుడితోపాటు అనుమానితుల కాల్ డేటాలు పోలీసులు సేకరించారా?సేకరిస్తే ఏమైనా ఆధారాలు దొరికాయా అనేది పోలీసులకే తెలియాలి. ప్రస్తుతం గీసుగొండ సీఐగా విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అత్యుత్తమ అధికారుల్లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మరి ఈ మిస్టరీ కేసు ను ఆయన ఏ విధంగా ముగిస్తారో, ఎంత త్వరగా ఛేదిస్తారో చూడాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







