August 2025 | ఫాస్ట్‌ట్యాగ్, క్రెడిట్ కార్డ్, UPI కోసం కొత్త నియమాలు
Financial New rules From August 2025 : ఆగస్టు నెలలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఈ మార్పులు మీ రోజువారీ లావాదేవీలు, ప్రయాణం, క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. UPI లావాదేవీల కోసం సవరించిన నియమాలు, ప్రైవేట్ వాహనాలకు కొత్త FASTag వార్షిక పాస్, ఎంపిక చేసిన SBI క్రెడిట్ కార్డులపై ఉచిత బీమా కవర్ విత్‌డ్రా ఈరోజు నుండి అమల్లోకి వచ్చాయి. ఆగస్టులో అమల్లోకి వచ్చే ప్రధాన మార్పులు ఇవే..
ఆగస్టులో UPI మార్పులు
UPI Changes 2025 : UPI లావాదేవీల పనితీరును మెరుగుపచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎకోసిస్టమ్‌లో అనేక మార్పులు చేసింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ రిక్వెస్ట్‌లను పరిమితం చేయడం నుండి ఆటోపే మాండేట్ ఎగ్జిక్యూషన్, వాలిడేట్ అడ్రస్ వంటి APIల వినియోగాన్ని నియంత్రించడం వరకు NPCI UPI ఎకోసిస్టమ్ సభ్యు...