IBS admissions | బిజినెస్ స్కూల్‌లో ప్రవేశాలు షురూ.. ఈసారి కొత్త విధానం
IBS admissions : ఐసీఎఫ్ఏఐ (ICFAI) యూనివర్సిటీ ఆధ్వర్యంలోని బిజినెస్ స్కూల్ (IBS)లో అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభమైంది. ఎంబీఏ /పీజీపీఎం (MBA/PGPM) ప్రోగ్రామ్స్‌లో 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాల (IBS admissions ) కోసం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో ఇది కొనసాగనుంది.
ఎంపిక విధానంలో మార్పులు ఏమింటే…
దేశంలోని ఐదు ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో IBS ఒకటి. ఇది వృత్తిపర, పరిశోధన ఆధారిత బిజినెస్ ఎడ్యుకేషన్‌ను అందించడంలో పేరు గాంచింది. ఈ సంవత్సరం IBS తమ ఎంపిక విధానంలో ఒక కీలక మార్పు చేసింది. సాధారణంగా గ్రూప్ డిస్కషన్ (GD) నిర్వహించే ఈ విద్యాసంస్థ కొత్తగా మైక్రో ప్రజెంటేషన్ అనే ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల ప్రతి విద్యార్ఙికీ వ్యక్తగతంగా తమ ఆలోచనలను చక్కగా వ్యక్తీకరించే మంచి అవకాశం లభిస్తుంది....




