Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్
Zomato : ఆహార డెలివరీ, క్విక్ కామర్స్‌లో అగ్రగామిగా ఉన్న జోమాటోకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) విభాగం నుంచి నోటీస్ అందింది. రూ. 803 కోట్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని జీఎస్టీ విభాగం అందులో పేర్కొంది. థానేలోని సీజీఎస్టీ (CGST), సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ద్వారా ఈ నోటీస్ జారీ అయ్యింది. రూ. 401.7 కోట్ల GST డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానాతో కలిపి రూ. 803 కోట్లు జోమాటో (Zomato) చెల్లించాల్సి ఉందని వివరించింది.
'ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీసు డెలివరీ చార్జీలపై జీఎస్టీ చెల్లించలేకపోవడం కారణంగా జారీ అయ్యింది. మొత్తం రూ. 803 కోట్లలో రూ. 401.7 కోట్ల జీఎస్టీ డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానా ఉన్నాయి' అని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ వెల్లడించింది.
Zomatoకు ఇదేం కొత్తకాదు..
డెలివరీ చార్జీలపై రావాల్సిన ట్యాక్స్‌కు సంబంధించి జోమాటోకు జీఎస్టీ విభాగం నోటీసులు జారీ చేయడం ఇ...