Silver | వెండి మార్కెట్ ఆశాజనకమే.. తాజా రిపోర్టు
Silver Bull Run To Continue : వెండి మార్కెట్‌కు మంచి ఉజ్వల భవిష్యత్ కనిపిస్తోంది. దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. 2025లో వెండి (Silver) మార్కెట్‌కు ఢోకా లేదని అంటున్నాయి. రానున్న 12 -18 నెలల్లో వెండి ధరలు మరింత పెరుగుతాయని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (Emkay Wealth Management Limited) సంస్థ అంచనా వేస్తోంది. అమెరికాలో తగ్గుతున్న వడ్డీ రేట్లు, జియో పాలిటికల్ ఉద్రిక్తతలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), గ్రీన్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న డిమాండ్ దీని కారణాలు అని విశ్లేషకులు అంటున్నారు.
Gold and Silver market : వెండి వినియోగం
వెండిని ఆభరణాలు, ఇతర విలువైన పాత్రలు, వస్తువులకు మాత్రమే కాకుండా పారిశ్రామికంగా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తుంటారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్ బోర్డులు, సోలార్ ప్యానెల్స్, EV బ్యాటరీలలో వాడుతారు. ప్రపం...