ATM withdrawals | భారంగా మారున్న ఏటీఎం వినియోగం.. పెరగనున్న చార్జీలు!
ATM withdrawals ఏటీఎం వినియోగం ఇక భారం కానుంది. నగదు విత్‌డ్రా ఖరీదు (costlier)గా మారనుంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు (ATM interchange fees) పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India (RBI)) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఇది మే 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే..
ఏటీఎం లావాదేవీల (financial transactions)ను అధికంగా ఉపయోగించే ఖాతాదారుల (customers)పై ఈ మార్పు భారం కానుంది. ఉచిత పరిమితిని మించిన ప్రతి లావాదేవీపై అదనపు రుసుములు ఇక నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు (ATM interchange fees) అనేది ఒక బ్యాంకుకు మరో బ్యాంకు ఏటీఎంను ఉపయోగించిన ఖాతాదారుల లావాదేవీల కోసం చెల్లించాల్సిన చార్జీ. ఈ రుసుములు సాధారణంగా ఖాతాదారులకే భారంగా మారనున్నాయి.
ATM withdrawals : ప్రతి లావాదేవీపై అదనపు చార్జి
మే 1 ను...




