India imports Russian oil : రష్యా నుంచి భారత్‌కు భారీగా ముడి చమురు.. ఏ స్థాయిలో తెలుసా?
India imports Russian oil : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా భారత్ (India) పేరుగాంచింది. ఎక్కువ స్థాయి దిగుమతిదారు (importing nation)గా గుర్తింపు పొందింది. ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russian) దాడి చేసిన మూడో సంవత్సరంలో ఆ దేశం నుంచి భారత్ 49 బిలియన్ యూరోలు విలువైన ముడి చమురును కొనుగోలు చేసిందని తాజా నివేదికల ద్వారా వెల్లడైంది.
Russian oil : మధ్యప్రాచ్య దేశాల నుండి రష్యాకు మార్పు
ప్రధానంగా ముడి చమురును మిడిల్ ఈస్ట్ (Middle East) దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటూ వచ్చింది. అయితే 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా (Russian) దాడి చేసిన తర్వాత రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. రష్యా ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారీ డిస్కౌంట్‌తో లభించడమే ఇందుకు కారణం.
ఎక్కువ దిగుమతులకు కారణం ఏమిటంటే..
రష్యా చమురు (Russian ...